Venu Madhav-Pawan Kalyan: వేణుమాధవ్ 10 ఎకరాల భూమితో పవన్ కళ్యాణ్ కున్న సంబంధం ఏమిటో తెలుసా?

Venu Madhav-Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వేణుమాధవ్. వేణుమాధవ్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. 1968 సెప్టెంబర్ 28న ఆయన జన్మించారు. వేణుమాధవ్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉండిపోయారు. ఒక రోజుకు మూడు షిఫ్ట్ లలో పాల్గొంటూ ఎన్నో సినిమాలలో నటించిన ఈయన తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొని మరణించారు.

ఇకపోతే ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే భారీగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది ఇలా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుతో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడమే కాకుండా సొంత గ్రామంలో 10 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారట ఈ భూమిలో వేణుమాధవ్ వ్యవసాయం కూడా చేసే వారిని తాజాగా ఆయన కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

ఇలా తన పొలంలో వరి పంటను పండించే వారని, వరి పంట కోతకు వచ్చిన తర్వాత మొదటి బియ్యం బస్తాను వేణుమాధవ్ పవన్ కళ్యాణ్ కు తప్పకుండా పంపించేవారని వేణుమాధవ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు కూడా హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్ ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా తన ఫామ్ హౌస్ లో పండిన మామిడి పండ్లను పవన్ కళ్యాణ్ కూడా కొందరి నటీనటులకు పంపిస్తూ ఉంటారు.

ఇక వేణుమాధవ్ కూడా పవన్ కళ్యాణ్ కు బియ్యం బస్తా పంపించగా, పవన్ కళ్యాణ్ వేణుమాధవ్ కి మామిడి పండ్లను పంపించేవారట ఇది వీరిద్దరి మధ్య ఉన్న ఒప్పందం అని వేణుమాధవ్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇకపోతే వేణుమాధవ్ పవన్ కళ్యాణ్ నటించిన పలు సినిమాలలో నటించి సందడి చేశారు. ఈయన అనారోగ్య సమస్యలతో మరణించగా తన భార్య తన ఇద్దరు పిల్లలు బాగోగులు చూసుకుంటూ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -