Tarak: తారక్ జాతకంపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Tarak: ఈ మధ్యకాలంలో చాలా మంది జ్యోతిష్యం నమ్మడం ఎక్కువయ్యింది. అందులోనూ సెలబ్రిటీలు సైతం ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి నుంచి జాతకం చెప్పించుకుంటున్నారు. చైతన్య, సమంతల విడాకుల గురించి వేణుస్వామి గతంలో చెప్పిన విధంగానే జరిగాయని ఆ మధ్యన సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

 

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి వేణుస్వామి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ కి తిరుగుండదని వేణు స్వామి తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ జాతకం చాలా పవర్ ఫుల్ గా ఉందని, ఎవరైతే మఖ నక్షత్రంలో జన్మిస్తారో వాళ్లకు రాజకీయంగా కలిసొస్తుందని, ఎన్టీఆర్ ఆ నక్షత్రానికి చెందిన వాడు కాబట్టే ఆయనకు పాలిటిక్స్ లో మంచి పేరు వస్తుందని వేణుస్వామి తెలిపారు.

 

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నక్షత్రం కూడా మఖ నక్షత్రమని కావడంతో ఆమెకు సీఎం అయ్యే యోగ్యం కలిసి వచ్చిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కనుక జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 2024 సంవత్సరంలో ఎన్నికలకు వెళితే అద్భుత ఫలితాలు చూడొచ్చని ఆయన తెలిపారు. అలా జరగకపోతే మాత్రం టీడీపీకి అనుకూల ఫలితాలు రావని తేల్చి చెప్పారు.

 

రాజకీయంగా చూస్తే తారక్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, ప్రస్తుతం తెలుగుదేశంకు ఉన్న ఏకైక గెలుపు మార్గం ఎన్టీఆర్ అని వేణుస్వామి తెలియజేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్ వల్ల టీడీపీ అధికారంలోకి రావడం ఈసారి సాధ్యమయ్యే పని కాదని వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి వేణు స్వామి చెప్పిన విషయాలు నిజం అవుతాయా? కావా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. మరోవైపు తారక్ కూడా ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండాలని చూస్తుంటే ఆయన్ని బరిలోకి దింపాలని మరికొంత మంది ప్రయత్నాలు చేస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -