Prabhas: ప్రభాస్ పెళ్లిపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Prabhas: అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ పేరు వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు చాలా మంది అభిమానులున్నారు. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ప్రభాస్ భారీ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కెరీర్ పరంగా ఎప్పుడూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడని చెప్పాలి. అయితే కొందరు మాత్రం ఆయన వ్యక్తిగతంగా చాలా వెనకబడ్డారని అంటున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎప్పుడూ ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

 

ప్రభాస్ పెళ్లి చేసుకోవాలనుకుంటే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ కోరిక మాత్రం తీరడం లేదు. ప్రభాస్ ఎప్పుడూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉంటూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు.
అయితే ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తాజాగా ప్రముఖ సిద్దాంతి, జ్యోతిష్య నిపుణుడు వేణుస్వామి ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని సంచలన కామెంట్లు చేశాడు.

 

జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఇటీవలె చాలా ఫేమస్‌ అయ్యాడు. ఆయన చెప్పినవి చాలా జరిగాయి. అందుకే ఆయన చెప్పేవి జరుగుతాయని అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా చైతూ, సమంతలు విడాకులు తీసుకుంటారని ఆయన అందరికంటే ముందుగా చెప్పారు. అందుకే ఆయన మాటలకు క్రేజ్ ఎక్కువగా ఉంది.

 

తాజాగా ఆయన ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటే చివరకు పెళ్లి పెటాకులైపోతుందని వేణు స్వామి కుండబద్దలు కొట్టి చెప్పాడు. ప్రభాస్‌కు పెండ్లి జరిగితే దివంగత హీరో ఉదయ్ కిరణ్‌కి పట్టిన గతే పడుతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చనిపోవడం ఖాయమని అన్నారు. వేణు స్వామి చేసిన ఈ కామెంట్లతో ప్రభాస్‌ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేణు స్వామిపై ఫైర్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -