Victory Venkatesh: ద్వేషించే అభిమానులు లేని ఘనత వెంకీకి మాత్రమే సొంతమా?

Victory Venkatesh: టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ దర్శక నిర్మాతలకు మాత్రం ఎటువంటి సమస్యా రానివ్వని హీరోలు కొందరే ఉంటారు. మనిషికి ఉండే ప్రేమ, అసూయ, జాలి వంటి వాటిల్లో కొందరిలో కొన్ని గుణాలుంటాయి. మరికొందరిలో ఏదో ఒకటి ఉండకపోవచ్చు. కానీ హీరోల్లో అన్ని గుణాలుండే వ్యక్తిగా వెంకీ నిలిచిపోయారు. హీరోల్లో కొందరు మాస్ గా ఉంటారు. మరికొందరు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ వెంకీ విషయంలో అవన్నీ జరగవు. ఆయన పనేదో అది చేసుకుంటూ కామ్ గా ఉంటారు.

 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకీని ద్వేషించేవారు అస్సలు లేరు. కొంత మంది ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మాత్రం హేటర్ గా ఎవ్వరితోనూ కనిపించరు. విక్టరీ వెంకటేష్ సినీ జీవితం, వ్యక్తిగత జీవితం అంతా కూడా ఎంతో హుందాగా నిరాడంబరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆయన కెరీర్ లో ఎక్కడా గానీ వివాదాలనేవి అస్సలు ఉండవు. ఎటువంటి సమస్యల్లోనూ ఆయన తొంగి చూడరు.

 

విక్టరీ వెంకటేష్ తన కుటుంబ విషయాలను బయటకు తీసుకురారు. అలాగే సినిమా విషయాలను ఇంట్లో చర్చించరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జెంటిల్ మెన్ గా నిలిచిన ఏకైక వ్యక్తిగా ఆయన నిలిచిపోతాడు. డబ్బుల విషయంలో ఆయన ఏ ఒక్క రోజు కూడా ఎవరితోనూ గొడవ పడలేదు. అలా గొడవ పడినట్లు ఎక్కడా కూడా ఇంత వరకూ కనిపించలేదు.

 

మూవీ మొఘల్ అయిన రామానాయుడు కొడుకు అని ఆయన ఎక్కడా ఆడంబరాలకు పోలేదు. సురేష్ ప్రొడక్షన్స్ తన అన్నదే అయినా కూడా అందులోకి తొంగి చూడలేదు. షూటింగ్ లో కూడా ఆయనకు సంబంధించిన పని చూసుకుని తన పనేంటో చేసుకుని వెళ్లిపోతాడు. ఆ విధంగా కుటుంబాన్ని, సినిమాను వెంకీ ప్రేమిస్తాడు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు వయసు పెరిగిపోయినా ఇంకా కుర్ర హీరోయిన్స్ తో జత కట్టాలని చూస్తున్నారు. కానీ వెంకీ మాత్రం నారప్ప, గురు వంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు సినిమాల రెమ్యునరేషన్ విషయంలో కూడా వెంకీ ఎప్పుడూ నిర్మాతలతో గొడవ పడలేదు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో సునీతకు వరుస షాకులు.. ఏం జరిగిందంటే?

Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్ళకూడదని, సీబీఐ విచారణకు...
- Advertisement -
- Advertisement -