Vijay: విజయ్ కు దెబ్బ మీద దెబ్బ.. పూరీ చేసిన పాపమేనా?

Vijay: వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఒకప్పటి స్టార్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. దాదాపుగా ప్రతి తెలుగు హీరోకు మాస్ ఇమేజ్, ఇండస్ట్రీ హిట్ అందించిన పూరి ప్రస్తుతం కెరీర్ లో చాలా ఇబ్బందికరమైన రోజులను ఎదుర్కుంటున్నారు. హిట్టు మూవీ కోసం తనదైన శైలిలో ఎన్నో ప్రయత్నాలు చేసిన పూరి.. ఇటీవల విజయ దేవరకొండతో చేసిన లైగర్ కొంత ఉపశమనం కలిగించింది.

లైగర్ పెట్టుబడులపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు
ఇక ఈ మూవీ పెట్టుబడుల విషయంలో మొదటి నుండి గందరగోళం నెలకొంది. ఈ సినిమాల్లో అక్రమ సంపాదనను పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత ED కి కంప్లెయింట్ చేయడంతో ఇక ఈడీ రంగంలోకి దిగింది. ఈ సినిమాలో పెట్టుబదులతో సంబంధం ఉన్న అందర్నీ ఒక్కొక్కరినీ విచారిస్తోంది. సినిమాలో నిర్మాతగా ఉన్న చార్మీ, దర్శకుడు పూరీని ఇటీవలే ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపడంతో విజయ్ ఈడీ ముందు విచారణకు హాజరయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆర్ధిక లావాదేవీలు, విజయ్ రెమ్యునరేషన్ సంబంధిత విషయాల గురించి ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.

ఈ సినిమా పెట్టుబడుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేతులు ఉన్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఈడీ ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుండటంతో మరిన్ని అంశాలు బయట పడనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -