Rashmika: రష్మికకు విజయ్ దేవరకొండ అభిమానులు ఇచ్చిన భారీ షాక్ ఇదే!

Rashmika: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆ వార్తలపై అటు విజయ్ దేవరకొండ కానీ ఇటు రష్మిక మందన కానీ స్పందించలేదు. వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ చెప్పుకొస్తున్నారు. కాగా ఇప్పటికే వీరు ఇద్దరూ పలు సార్లు కలిసి వెకేషన్ లు తిరగడం మాత్రమే కాకుండా పబ్బులు పార్టీలకు కూడా హాజరైన విషయం తెలిసిందే. దీంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మికకు విజయ్ అభిమానులు షాకిచ్చారు. అసలేం జరిగిందంటే..

రౌడీ హీరో, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీతో సాయి రాజేశ్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇక సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ఇటీవలే హైదరాబాద్ లోని పీవీఆర్ ఆర్కే స్క్రీన్ లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హాజరయ్యారు. రష్మిక చేతుల మీదుగా ఈ సినిమాలోని పాటను రిలీజ్ చేశారు. అనంతరం రష్మిక మందన్న మాట్లాడబోతుండగా ఇంతలో విజయ్ దేవరకొండ అభిమానులు నానాహంగామా చేస్తూ రచ్చ రచ్చ చేశారు.

 

వదినా..వదినా అంటూ ఈలలు వేస్తూ గోల చేశారు. విజయ్, రష్మికలపై వస్తున్న వార్తలు నిజమైతే ఆనంద్ దేవరకొండకు ఈ అమ్మడు వదిన అవుతుంది. కాబట్టి అతడికి సపోర్టు చేయడానికి రష్మిక వచ్చిందనే అర్ధం వచ్చేలా విజయ్ ఫ్యాన్స్ అరుపులు ప్రారంభించారు. విజయ్ అభిమానులు అంత రచ్చ చేసినా రష్మిక ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కేవలం చిరునవ్వు చిందిస్తూ అలా ఉండి పోయింది. అలా ఉందంటే ఆమె ప్రేమ విషయం నిజమే కావచ్చంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఏమి చెప్పలేక మౌనంగా నవ్వుతూ తన ప్రేమ విషయాన్ని అంగీకరించింది అంటే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -