Vijay Hazare Trophy: రుతురాజ్ నాలుగు సెంచరీలు వృథా.. సౌరాష్ట్రదే విజయ్ హజారే ట్రోఫీ

Vijay Hazare Trophy: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 248 పరుగులు చేసింది. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫైనల్లోనూ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ రుతురాజ్‌(131)కు తోడుగా ఏ ఒక్కరూ రాణించలేదు. దాంతో మహారాష్ట్ర సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. సౌరాష్ట్ర బౌలర్లలో చిరాగ్ జానీ మూడు వికెట్లు సాధించాడు. జయదేవ్ ఉనద్కట్, ప్రేరక్ మన్కండ్, పార్థ్ భుట్ తలో వికెట్ తీశారు.

అనంతరం 249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షెల్డన్ జాక్సన్ అద్భుత సెంచరీ చేశాడు. 136 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 నాటౌట్‌గా నిలిచాడు. అతడికి తోడుగా హర్విక్ దేశాయ్(50), చిరాగ్ జానీ(30 నాటౌట్) రాణించారు. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేశ్ చౌదరి, విక్కీ రెండేసి వికెట్లు తీయగా.. సత్యజీత్ బాచ్‌లావ్ ఓ వికెట్ పడగొట్టాడు. సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించిన షెల్డన్ జాక్సన్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ లభించింది.

కాగా ఈ టోర్నీలో తన జట్టు ఓడిపోయినా మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ మాత్రం అదరగొట్టాడు. అతడు ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలతో మొత్తం 660 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. మరోవైపు సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ అటు కెప్టెన్‌గా.. ఇటు బౌలర్‌గా సత్తా చాటాడు. 19 వికెట్లతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

వేలంలో రుతురాజ్, ఉనద్కట్ ఆకర్షించేనా?
రుతురాజ్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల వేలంలో రుతురాజ్‌ను వదిలేసిన చెన్నై యాజమాన్యం అతడిని మళ్లీ దక్కించుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అని కామెంట్ చేస్తున్నారు. అటు ముంబై ఇండియన్స్ తరఫున గత సీజన్‌లో దారుణంగా విఫలమైన ఉనద్కట్‌ను ఆ జట్టు వదిలేసింది. దాంతో ఈ నెలలో జరిగే మినీ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -