Bapineedu-Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు నాట పరిచయం అక్కరలేనిది. దాదాపు 150కు పైగా సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి బ్రేక్ డాన్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలతో సమానంగా వరుస సినీ ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాడు చిరు. ఈ విధంగా చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక చిరంజీవి సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక మంచితనంలో కూడా చిరంజీవి ఒక అడుగు ముందే ఉంటాడని చెప్పవచ్చు.
ఆపదలో ఉన్నవారికి లేదనకుండా సహాయం చేస్తాడు. ఇక చిరు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్, తన సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇదిలా ఉంటే అప్పట్లో చిరంజీవికి బాగా సన్నిహితంగా ఉండే నిర్మాత విజయ బాపినీడు గురించి మనందరికీ తెలిసిందే. 1988 జూన్ 10న ఖైదీ నెంబర్ 786 సినిమా విడుదల చేశారు. ఈ సినిమా అప్పట్లో ఒక రేంజ్ లో హడావిడి చేసింది.
ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ లో హీరో చిరంజీవికి బాపినీడు ఏకంగా ఏనుగును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ బహుమానం చూసి అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక కళా బంధు సుబ్బరామిరెడ్డి ఇచ్చిన సలహా మేరకు చిరంజీవి ఆ ఏనుగును తిరుపతిలో దేవస్థాన అధికారులకు అందజేశాడు. అప్పట్లో ఖైదీ నెంబర్ 786 సినిమా బాలకృష్ణ పుట్టిన రోజున విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి హీరోలు కృష్ణ కృష్ణంరాజు పాల్గొనడం చాలా ప్రత్యేకం. ఏదేమైనా అప్పట్లో చిరంజీవి ఈ సినిమాతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.