Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త నాటకం.. రాజీనామా పేరుతో డ్రామా ఆడుతున్నారా?

Vijayasai Reddy: వైసీపీలో ఒకప్పుడు జగన్ తర్వాత నెంబర్ 2గా పేరు తెచ్చుకున్నారు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వెంటే ఉండేవారు. పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. ట్విట్టర్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలతో రెచ్చిపోయేవారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత విజయసాయిరెడ్డి సీన్ రివర్స్ అయింది. విజయసాయిరెడ్డి, జగన్ మధ్య గ్యాప్ చాలా పెరిగింది. జగన్ అమరావతిలో ఉంటుండగా.. విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో మకాం వేశారు. పార్టీ కూడా విజయసాయిరెడ్డి ప్రాధాన్యత చాలా తగ్గిపోయింది. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఇక పార్టీలోనూ ఆయన పాత్ర కీలకంగా మారింది. విజయసాయిరెడ్డి పాత్ర పార్టీలోనూ చాలా తగ్గింది. దీని వెనుక కారణాలు అనేకం వినిపిస్తున్నాయి. గతంలో జగన్, విజయసాయిరెడ్డి అక్రమ కేసుల్లో జైలుజీవితం గడిపారు. దీంతో సీఎంగా ఉన్న తన పక్కన విజయసాయిరెడ్డిని పెట్టుకుంటే ప్రతిపక్షాల నుంచి మరిన్ని తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే విజయసాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టేశారనే వాదన ఉంది. ఇక జగన్, విజయసాయిరెడ్డి మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే దూరం పెట్టారనే వాదన మరోలా ఉంది.

అయితే ఇటీవల విజయసాయిరెడ్డిపై విమర్శలు మరింత పెరుగుతన్నాయి. విశాఖలోనే ఉంటూ అక్కడ భూములను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పార్టీలోని అందరూ తన మాటే వినాలని విజయసాయిరెడ్డి తన కనుసన్నల్లో నడుపుతున్నారట. దీంతో విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. ఏది ఎలా ఉన్నా రాజ్యసబలో వైసీపీ తరపున విజయసాయిరెడ్డి తన వాయిస్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన సంచలన శపథం చేశారు.

విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన శపథం చేశారు. మంగళవారం ఢిల్లీలో విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలతో పాటు విభజన హామీలపై చర్చ జరిగింది. విశాఖ రైల్వే జోన్, రాజధానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ లాంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో విశాఖకు రైల్వే జోన్ ఇచ్చే అవకాశం లేదని రైల్వేబోర్డు తేల్చిచెప్పింది. రైల్వేజోన్ లాభదాయకం కాదని చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఏపీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 22 మంది ఎంపీలు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ రైల్వే జోన్ అంశంపై విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విశాఖకు రైల్వేజోన్ ఇస్తామని తనతో కేంద్ర రైల్వేశాఖ మంత్రి స్వయంగా చప్పారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటివరకు ఎలాంటి అడుగులు పడలేదు. గత మూడేళ్ల నుంచి వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించలేదు. రైల్వే జోన్ పై ఒత్తిడి తీసుకురాలేదు. ఇప్పుడు కేంద్రం రైల్వే జోన్ ఉండదని చెప్పడంతో విజయసాయిరెడ్డి రాజీనామా పేరుతో మైండ్ గేమ్ మొదలుపెట్టారని చెబుతున్నారు. కొత్త డ్రామా స్టార్ట్ చేశారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కేంద్రం ఇవ్వనని చెప్పడంతో కప్పిపుచ్చుకోలేక నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -