Varasudu: విజయ్ ‘వారసుడు’ మూవీ రివ్యూ

Varasudu: విడుదల తేదీ : జనవరి 11, 2023

నటీనటులు : విజయ్, రష్మిక మందన, శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు

దర్శకత్వం : వంశీ పైడిపల్లి

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా

సంగీతం : ఎస్. థమన్

సినిమాటోగ్రఫీ : ఛోటా కె నాయుడు

నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి

ఎడిటర్ : కె ఎల్ ప్రవీణ్

ఇయళపతి విజయ్ ప్రధాన పాత్రలో స్ట్రెయిట్ తెలుగులో చేసిన మొదటి సినిమా ‘వారసుడు’ థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన హీరోయిన్ గా చేసిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో విడుదల కాగా.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం.

 

కథ:

పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన రాజేంద్రన్ (శరత్ కుమార్) వారసత్వాన్ని ఎవరు పునికి పుచ్చుకుంటారనే అంశం మీద ఈ సినిమా తెరకెక్కింది. కోట్ల విలువ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాజేంద్రన్ బిజినెస్ లను అతడి ముగ్గురు కొడుకులైన జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్)లలో ఎవరు పొందుతారు అనేది ఇందులో కథ. తన తండ్రి విధానాలను నచ్చక ఇంటికి దూరంగా వెళ్లిపోతాడు విజయ్.

ఇక తమ తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడానికి, అతడి కుర్చీ మీద కొడుకులు జై, అజయ్ లు ఆశపడతారు. అయితే రాజేంద్రన్ తన టైమ్ ముగిసిపోయిందని తెలుసుకొని, తన వ్యాపారాలను చక్కదిద్దడానికి సరైన వారసుడి కోసం చూస్తుంటాడు. ఈ క్రమంలోనే విజయ్ మంచితనం, ప్రేమ, తెలివితో బిజినెస్ ని డీల్ చేసే విధానంతో తానే వారసుడు అని నిరూపించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే తన అన్నల్లో ఎలాంటి మార్పులు తెచ్చాడు, ప్రత్యర్థులను ఎలా డీల్ చేస్తారనేది చూపించారు.

 

విశ్లేషణ:

వారసుడు సినిమా కథ కొత్తదేమీ కాదు. అప్పట్లో వచ్చిన మణిరత్నం ‘నవాబ్’ సినిమాకు ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. కార్పోరేట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథలో బిజినెస్ లను చేజిక్కించుకోవడానికి సొంత మనుషులే ఎలా వెన్నుపోటు పొడుస్తారనే విషయాలను చూపించారు. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు గతంలోనే ఈ సినిమాను చూసిన ఫీలింగ్ మాత్రం వెంటాడుతుంది.

 

సినిమా మైనింగ్ డీల్స్ క్లాష్ జేపీ (ప్రకాశ్ రాజ్) గ్రూప్, రాజేంద్రన్ గ్రూప్ (శరత్ కుమార్)తో ప్రారంభమవుతుంది. తర్వాత విజయ్ ని ఓ మాస్ సాంగ్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత రాజేంద్రన్ కుటుంబ సభ్యులను చూపించడం, ఫ్యామిలీ సీన్లు వస్తాయి. విజయ్ ని కథలో బాగా ఇన్వాల్ అయ్యేలా చేశాక ఇంట్రవెల్ లో ఓ ట్విస్ట్ పెట్టారు. ఆ తర్వాత విజయ్ తన తండ్రి బిజినెస్ లను ఎలా టేకోవర్ చేస్తాడు, ప్రత్యర్థులకు ఎలా చుక్కలు చూపిస్తాడనేది చూపిస్తారు. సినిమా కథను ఆడియన్స్ ముందే ఊహించేలా కథ సాగుతుంది.

 

వంశీ పైడిపల్లి ఈ సినిమా కథను రాసుకునేటప్పుడు విజయ్ ని దృష్టిలో పెట్టుకొనే దీనిని రాసినట్లు అర్థమవుతుంది. విజయ్ ని వంశీ పైడిపల్లి ఎలివేట్ చేసే సీన్లు ఎక్కువగా కనిపించాయి. అలాగే గతంలో విజయ్ చేసిన చాలా సీన్లు ఇందులో కనిపించేలా చేయడం వల్ల విజయ్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరచాలని వంశీ పైడిపల్లి ప్రయత్నించాడు. అయితే ఇది తమిళంలో వర్కవుట్ అయిందేమో కానీ తెలుగు ప్రేక్షకులు ఇది పెద్దగా అనిపించలేదు.

 

సెకండాఫ్ లో కామెడీ, హీరోయిజం సరిగ్గా మెయింటెన్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. వంశీ పైడిపల్లి మార్క్ సెంటిమెంట్ సీన్లను సినిమాలో చొప్పించారు. ఫ్యామిలీ డ్రామాలో సాగే కథలో అప్పుడప్పుడు ఫైట్లు, కామెడీ సీన్లు కనిపిస్తాయి. ఇక రొమాంటిక్ ట్రాక్, విలన్ ట్రాక్ లు అయితే బలవంతంగా పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది.

 

నటన విషయానికి వస్తే ఈ సినిమాను పూర్తిగా విజయ్ తన భుజస్కందాల మీద వేసుకొని నడిపించాడు. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, జయసుధ లాంటి వాళ్లు అద్భుతంగా నటించారు. హీరోయిన్ రష్మిక మందనకు తక్కువ స్కోప్ ఉన్నా స్క్రీన్ మీద ఎంతో అందంగా చూపించారు.

 

టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాలోని కార్పోరేట్ స్టైల్ సీన్లను చాలా గ్రాండ్ గా చూపించారు. డబ్బు విషయంలో దిల్ రాజు వెనక్కి తగ్గలేదని అనిపించింది. కెమెరాపనితనానికి మెచ్చుకోవాల్సిందే. ఇక పాటల్లో రెండు బాగా అనిపించగా.. మిగిలినవి పర్లేదు అనిపించాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. మరీ ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లలో, హీరో ఎలివేషన్ సీన్లలో అయితే పీక్స్ లో అనిపించింది.

 

ప్లస్ పాయింట్స్ :

విజయ్ యాక్టింగ్

కామెడీ

భావోద్వేగ సన్నివేశాలు

యోగిబాబుతో వచ్చే సీన్లు

మైనస్ పాయింట్స్ :

ఊహించగల రొటీన్ కథ

నెమ్మదిగా సాగే కథనం

ఫ్యాన్స్ కోసం పెట్టిన విజయ్ సీన్లు

రేటింగ్ 2.75/5.0

బాటమ్ లైన్ : విజయ్ ఫ్యాన్ అయితే పండగ.. లేదంటే ఒకసారి చూడొచ్చు

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -