Actor Mahesh Anandh: అప్పట్లో ఆ స్టార్ విలన్ మహేష్ ఆనంద్ ఎలా చనిపోయాడో తెలిస్తే షాక్ అవుతారు!

Actor Mahesh Anandh: సినీ ప్రియలకు అప్పటి స్టార్ విలన్ మహేష్ ఆనంద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తూ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. లంకేశ్వరుడు, నెంబర్ వన్, టాప్ హీరో, బొబ్బిలి సింహం, ఎస్పీ పరశురాం, అల్లుడా మజాకా, ఘరానా బుల్లోడు, వంటి సినిమాల్లో విలన్ పాత్రను పోషించి నటుడిగా తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు మహేష్.

మరి ఇటువంటి గొప్ప విలన్ ముంబైలో తన సొంత ఇంట్లో ఒంటరిగా మరణించాడు. ఇప్పుడు మనం మహేష్ పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమయం లో మహేష్ ఆనాటి నటి రీనా రాయ్ సోదరి వర్కా రాయ్ ను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లోనే ఈమె ఇంటర్నేషనల్ మిస్ ఇండియా గా కిరీటాన్ని సొంతం చేసుకుంది. కానీ వీరిద్దరి దంపతులు రెండేళ్ల తర్వాత పూర్తిగా వారి దాంపత్య జీవితానికి బ్రేక్ అప్ చెప్పుకున్నారు.

ఆ తర్వాత మరే అమ్మాయి కూడా మహేష్ లైఫ్ లో నేను నిలిచి ఉండలేదు. దాదాపు వరసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ మహేష్ తో ఏ అమ్మాయి కూడా సహజీవనం సాగించలేదు. ఇలా మహేష్ ను అందరూ వదిలేసి వెళ్లిపోవడంతో కెరీర్ పరంగా దూసుకు వెళ్తున్న క్రమంలో తను డిప్రెషన్ కి గురయ్యాడు. దాంతో మహేష్ ఫుల్ గా అల్కా హాలిక్ గా మారిపోయాడు. ఇక షూటింగ్ సమయంలో కూడా మహేష్ ముందు పుచ్చుకోవడంతో అతడికి సరిగ్గా సినిమా ఆఫర్లు రావడం కూడా తగ్గిపోయాయి.

ఆ తర్వాత మహేష్ వరుసగా తన ఆస్తులు అమ్ముకుంటూ మద్యం సేవిస్తూ గడిపేవాడు. 24 గంటలు మద్యం మత్తులో ఉండేవాడు. ముంబైలో ఒక హౌస్ లో ఉంటూ బయటికి రాకుండా మద్యం సేవిస్తూ ఉండేవాడు. అలా మహేష్ కొన్ని రోజులకి అదే ఇంటిలో గుండెపోటుతో మరణించాడు. మహేష్ చనిపోయినప్పుడు తన చుట్టూ మొత్తం మద్యం సీసాలే కనిపించాయట.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -