Viral Fever: వైరల్ ఫీవర్ వస్తే ఏం చేయాలో తెలుసా?

Viral Fever: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. చలికాలం మొదలు కావడంతోనే వర్షాలు రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా వైరల్‌ ఫీవర్లు చాలా మందిని పీడిస్తున్నాయి. వానాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా వరకు వ్యాప్తి చెందుతుంటాయి. వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు తయారవుతాయి. దీని వల్ల వైరల్ జ్వరాలు వ్యాపిస్తాయి.

 

వైరల్ ఫీవర్లు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్యులు సూచిస్తూనే ఉంటారు. వాటిని పాటించడం ద్వారా ప్రమాదకర వైరల్ ఫీవర్ల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో వైరస్‌, బ్యాక్టీరియా యాక్టివ్‌గా ఉంటుంది. అందువల్ల రోగాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. జ్వరాలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

 

 

 

జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పిని అలక్ష్యం చేయకూడదు. ఈ సమస్యలు ఎక్కువై వాంతులు, కడుపు నొప్పి మొదలైతే డాక్టర్లు ఇమ్మీడియట్ గా సంప్రదించి వైద్యం పొందాలి. తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పిగా ఉన్నట్లయితే వైరల్ ఫీవర్ లక్షణాలుగా చెప్పొచ్చు. ఈ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కీళ్ల నొప్పులు అధిగమవుతాయి. కాళ్లు, చేతులు పీక్కుపోయినట్లుగా అనిపిస్తుంది. తరచూ వాంతులు అవుతుంటాయి. కళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. కళ్లు మంటగా అనిపిస్తాయి. చిన్నారులు, పెద్దలకు వెంటనే వైరల్ ఫీవర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

 

 

 

వైరల్ ఫీవర్ వస్తే వైద్యం ఇలా..
జ్వరం వచ్చింది కదా అని వెంటనే మాత్రలు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తొలుత తీసుకొనే ఆహారంలో పోషకాలు ఉండేటట్లుగా చూసుకోవాలంటున్నారు. నీరు, సూప్‌, కొబ్బరి నీళ్లు తీసుకుంటూ ఉండాలి. అయినాతగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇంట్లో దొరికే తేనె, అల్లం, పసుపు లాంటివి ఉపయోగించి వైరల్ ఫీవర్ ను తగ్గించుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -