Viral: కృష్ణుడు కోసం ఐపీఎస్ జాబ్ వదిలేసి బృందావనంకు వెళ్లిపోయిన మహిళ!

Viral: నేడు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇండ్లలో కూడా తల్లిదండ్రులు వారి చిన్న పిల్లలకు గోపిక,కృష్ణుడి వేషం వేసి మురిసిపోతున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ఆలయాలు నేడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకృష్ణుని రాధా, మీరా బాయి వంటి ఎంతోమంది ఆరాధించడంతోపాటు, శ్రీకృష్ణుని భక్తి పారవశ్వంలో తమ సర్వస్వాన్ని కూడా ధార పోశారు. అప్పట్లోనే కాకుండా ఇప్పటికీ అటువంటి శ్రీ కృష్ణుని భక్తులు ఎంతోమంది ఉన్నారు. శ్రీకృష్ణుని ఆనందాలు ఉంటే చాలు అనుకునే వారి ఎంతో మంది ఉన్నారు.

అటువంటి వారిలో హర్యానాకు చెందిన ఐపీఎస్ అధికారి భారతి అరోరా కూడా ఒకరు. ఈమె శ్రీకృష్ణుని మీద ఉన్న భక్తి తో,ఆయనకు సేవ చేయడం కోసం ఏకంగా తన అధికారాన్ని కీర్తిని అన్నిటినీ వదిలేసింది భారతి అరోరా. ఒక ఐపీఎస్ అధికారిగా ఎన్నో కేసులను ఛేదించిన ఆమె దైవ సేవ కోసం స్వచ్ఛందంగా పదవి విరమణ చేసింది. తనకు శ్రీ కృష్ణుడు సేవే గొప్పది అంటూ డిసెంబర్లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి బృందావనానికి వెళ్లిపోయింది భారతి అరోరా. ఇక పై ముందు ముందు తాను అసలైన జీవిత లక్ష్యం దిశగా అడుగులు వేస్తానని ఆమె తెలిపారు.

గురునానక్, తులసీ దాస్, కబీర్ దాస్ వంటి వారి మార్గంలో పయనిస్తానని భారతి అరోరా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇన్నేళ్లపాటు ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా ఈమెకు ఐపీఎస్ అధికారిగా ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉంది. కాగా ఆమె హర్యాణాలోని అంబాలా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఐజీ గా ఉన్నారు. 23 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేసే ఎన్నో కీలక కేసుల బాధ్యతలను నిర్వర్తించింది భారతి. అంతేకాకుండా భారతి అరోరా తన పనితీరుకు గాను భారత రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా అందుకుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన...
- Advertisement -
- Advertisement -