Jabardasth Pavithra: వైరల్ అవుతున్న్ జబర్దస్త్ పవిత్ర షాకింగ్ కామెంట్స్!

Jabardasth Pavithra: గత కొన్నేళ్ల నుండి బుల్లితెరపై మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షోలో పాల్గొన్న కమెడియన్లకు ఈ షో ద్వారా లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి. ఇక ఇందులో ఒకప్పుడు లేడీ గెటప్ వేసి బాగా సందడి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఏకంగా లేడి కమెడియన్సే రంగంలోకి దిగి తమ పర్ఫామెన్స్ తో అదుర్స్ అనేలా చేస్తున్నారు. ఇక అందులో ఒకరు పవిత్ర.

చూడ్డానికి పొట్టిగా ఉండే ఈ అమ్మాయి.. తన పంచులతో మాత్రం భలే నవ్విస్తుంది. బుల్లెట్ భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది ఇలా ప్రతి ఒక్కరి టీంలో చేస్తూ తన టైమింగ్ పంచులతో అందరిని బాగా ఆటాడిస్తుంది. అలా ఈమెకు జబర్దస్త్ బాగా కలిసి వచ్చింది. అయితే ఈమె మొదట్లో టిక్ టాక్ వీడియోస్ చేస్తూ అందరి దృష్టిలో పడింది.

 

ఆ సమయంలోనే ఆమె పలు సీరియల్స్ లలో కూడా చేయగా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఎప్పుడైతే జబర్దస్త్ లో అడుగు పెట్టిందో అప్పటినుంచి ఈమె తలరాత మొత్తం మారిపోయింది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర ఈవెంట్లలో కూడా బాగా సందడి చేస్తుంది. అంతేకాకుండా ఇటీవలే ఓ సినిమాలో కూడా అవకాశం అందుకోగా అందులో తను హీరోయిన్ పాత్రలో చేస్తుంది.

 

అయితే పవిత్ర జబర్దస్త్ కు రావటానికి మరో కారణం ఉంది. పిలవని పెళ్లికి వెళ్లడం వల్ల ఆమెకు జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. అదేంటి పిలవని పెళ్లికి.. జబర్దస్త్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా. అయితే ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో తన జబర్దస్త్ ఎంట్రీ గురించి తెలిపింది. ఓసారి తను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి.. అప్పారావు కొడుకు రిసెప్షన్ కి వెళ్లిందట.

 

అయితే తనను ఈ వేడుకకు ఎవరి పిలువ లేదని తెలిపింది. ఇక అక్కడ కమెడియన్స్ అభి, కెవ్వు కార్తిక్, అదుర్స్ ఆనంద్ పలువురు కమెడియన్స్ కనిపించారని.. వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాను అని తెలిపింది. ఇక డిన్నర్ సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి తింటుండగా.. తను జోక్స్ వేస్తుండగా.. తన జోక్స్ విని ఆనంద్, కెవ్వు కార్తీక్ చూసి తనను రైటర్ గా పని చేస్తావా అని అడిగారట.

 

దాంతో తన దగ్గర అంత టాలెంట్ లేదు.. ఏదైనా క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి అని అన్నదట. అయితే ఓసారి ఆనంద్ ఫోన్ చేసి ఓ క్యారెక్టర్ ఇచ్చాడట. ఆ క్యారెక్టర్ లో తనది ఒక చిన్న డైలాగ్ మాత్రమే ఉందని.. అయితే పర్ఫామెన్స్ చూసి జడ్జిగా ఉన్న రోజా ఫిదా అయిందని తెలిపింది. అలా తను జబర్దస్త్ లో సెటిలైపోయాను అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -