Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. అదేంటంటే?

Vegetable: మామూలుగా ప్రతివారం కూరగాయలు మూడు లేదా ఐదు రూపాయలు పెరిగితేనే జనాలు అవస్థలు పడుతూ ఉంటారు. అలాంటిది ఒక కూరగాయ మాత్రం దాదాపు రూ.లక్ష రూపాయల ధర పలుకుతుందట. వామ్మో.. ఏంటి ధర ఇంత ఉంది అని అనుకుంటున్నారా.. అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

 

ఈ ప్రపంచంలో మనకు తెలియని కొత్త కొత్త కూరగాయలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఏవేవో దేశాలలో పెరిగే ఆ కూరగాయలకు చాలా ధర ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే కూరగాయ పేరు హాఫ్ షూట్. ఈ పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది కదా. అయితే దీనిని హ్యూములస్ లుపులస్ అని కూడా పిలుస్తారట.

 

అయితే ఈ కూరగాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. ఇక ఈ కూరగాయ పువ్వులతో ఆల్కహాల్ తయారవుతుందని తెలిసింది. అంతేకాకుండా వీటి ఆకులు బీర్ తయారీలో ఉపయోగిస్తారట. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని ధర కేజీ లక్ష రూపాయలకు పలుకుతుందని తెలిసింది.

 

ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికా, యురేషియా, దక్షిణ అమెరికా దేశాలు వంటి ఉష్ణ మండలం ప్రాంతాలలో మాత్రమే పండితాయని తెలిసింది. అయితే అప్పట్లో భారతదేశంలో హిమాచల్ ప్రదేశంలో కూడా పండించారని తెలిసింది. ఇక వీటిని సాగు చేయడానికి కూడా చాలా ఖర్చవుతుందట. ఇక బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ కూరగాయను ఓ రైతు పండిస్తున్నాడని తెలిసింది. ఇక వీటిని కొయ్యటం, ఆకులను తీయడం వంటివి చాలా కష్టమైన పని అని తెలిసింది. ఇక వీటి ఉపయోగం చాలా ఉంటుంది కాబట్టి దీని ధర లక్షల్లో ఉందని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: చంద్రబాబు దూకుడు మామూలుగా లేదుగా.. రోజుకు మూడు సభలతో అలా ప్లాన్ చేశారా?

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న పలమనేరులో ప్రజా గళం పేరిట ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -