Virat Kohli: రన్ మెషీన్ 34వ బర్త్‌డే.. కోహ్లీ గురించిన ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Virat Kohli: విరాట్ కోహ్లీ.. పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ కు దగ్గరపడుతున్న తరుణంలో ఆ తర్వాత మాస్టర్ బ్లాస్టర్ స్థానాన్ని భర్తీ చేసే వారెవరా..? అని టీమిండియా అభిమానులు వేచి చూస్తున్న తరుణంలో భారత జట్టులోకి వచ్చిన కెరటం కోహ్లీ. దేశవాళీలో రాణించి.. అండర్-19 జట్టులో తానెంటో నిరూపించుకుని జాతీయ జట్టులోకి చేరిన కోహ్లీ.. గడిచిన 14 ఏండ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. ఛేదనలో మొనగాడిగా పేరున్న విరాట్ కోహ్లీ.. నేడు (నవంబర్ 5) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.

 

– 1988 నవంబర్5న ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీది పంజాబీ కుటుంబం. తండ్రి ప్రేమ్ కోహ్లీ, తల్లి సరోజ్ కోహ్లీ. విరాట్‌కు ఒక సోదరుడు (వికాస్ కోహ్లీ), ఒక సోదరీమణి (భావ్నా కోహ్లీ) ఉన్నారు. కోహ్లీ తండ్రి క్రిమినల్ లాయర్.
– చిన్నప్పట్నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న విరాట్.. 1998లో వెస్ట్ ఢిల్లీ తరఫున కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇంగ్లాండ్‌లో భారత జట్టు తరఫున అండర్-19 (2006లో) ఆడే వరకూ కోహ్లీ వెస్ట్ ఢిల్లీ తరఫునే ఆడాడు. దేశవాళీలో కోహ్లీ.. 2006లో తమిళనాడుతో తన తొలి మ్యాచ్ ఆడాడు.
– కోహ్లీ ముద్దుపేరు చీకూ.. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతడి కోచ్ అజీత్ చౌదరి ఆ పేరు పెట్టాడు.
– 2006 డిసెంబర్ 18న కర్నాటకతో రంజీ మ్యాచ్ ఆడుతుండగా కోహ్లీ తండ్రి చనిపోయాడని తెలిసింది. కానీ తన తండ్రి చనిపోయినా జట్టు కోసం కోహ్లీ తన ఆటను కొనసాగించాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ 90 పరుగులు చేశాడు.
– ఇంతవరకూ ఐపీఎల్‌లో వేలం లోకి రాని తొలి క్రికెటర్ కోహ్లీనే. 2008లో అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 12 లక్షలకు దక్కించుకుంది. అప్పట్నుంచి అతడు ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో ఫ్రాంచైజీ మారకుండా ఒకే జట్టు తరఫున ఆడుతున్న ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లీ మాత్రమే. 2022 లెక్కల ప్రకారం ఆర్సీబీ నుంచి ఏడాదికి విరాట్ తీసుకుంటున్న వేతనం రూ. 15 కోట్లు.
– ఇప్పటికే టన్నులకొద్దీ పరుగులు చేసిన కోహ్లీ.. భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. 2008లో తొలి వన్డే ఆడి 12 పరుగులే చేశాడు. 2011 లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రెండు ఇన్నింగ్స్ లలో 4, 15 పరుగులు మాత్రమే చేశాడు.
– అన్ని ఫార్మాట్లలో 50 సగటు ఉన్న ఏకైక క్రికెటర్.
– సచిన్ తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు (43) కోహ్లీవే.
– వన్డేలలో అత్యంత వేగంగా 8 వేలు, 9 వేలు, 10 వేలు, 11 వేలు, 12 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్.
– కెప్టెన్‌గా ఉండి టెస్టులలో ఏడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక సారథి.
– 2008లో అండర్-19 వన్డే ప్రపంచకప్ గెలిచిన సారథిగా ఉన్న కోహ్లీ.. సీనియర్ జట్టులో ఉండి కెప్టెన్ గా ఎన్నో మ్యాచ్ లను గెలిపించినా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా కొట్టలేదు. అది కోహ్లీ కెప్టెన్సీ కెరీర్ లో తీరని లోటు.
– క్రికెట్ కాకుండా కోహ్లీకి ఫుట్‌బాల్, టెన్నిస్ అంటే ఇష్టం. రోజర్ ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డోకు అభిమాని.
– కోహ్లీకి జంతువులంటే చాలా ఇష్టం. ముంబైలో రెండు ఎనిమల్ షల్టర్స్ ను ఏర్పాటు చేశాడు.

 

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts