Virat Kohli: వన్డేల్లో వరుసగా రెండో సెంచరీ బాదిన కోహ్లీ.. సచిన్ రికార్డు సమం

Virat Kohli: గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. వన్డేల్లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ తాజాగా శ్రీలంకతో తొలి వన్డేలోనూ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో వన్డేల్లో 45వ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా స్వదేశంలో ఆడిన వన్డేల్లో కోహ్లీకి ఇది 20వ సెంచరీ. గతంలో సచిన్ కూడా స్వదేశంలో ఆడిన వన్డేల్లో 20 సెంచరీలు నమోదు చేశాడు.

 

దీంతో సచిన్ నెలకొల్పిన రికార్డును కోహ్లీ సమం చేశాడు. సచిన్ స్వదేశంలో 164 వన్డే మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించగా.. విరాట్ కోహ్లీ 102 మ్యాచుల్లోనే 20 సెంచరీల మార్కు అందుకున్నాడు. మరోవైపు గౌహతి స్టేడియంలో కోహ్లీకి ఇది రెండో సెంచరీ. గతంలో ఇక్కడ ఆడిన వన్డేలో అతడు 140 పరుగులు చేశాడు.

 

ఓవరాల్‌లో కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 73వ సెంచరీ. టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన కోహ్లీ వన్డేల్లో 45 సెంచరీలు నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్‌లోనూ కోహ్లీ ఖాతాలో ఓ సెంచరీ ఉంది. ఈ మ్యాచ్‌లో 113 పరుగులు చేసిన కోహ్లీ ఈ సిరీస్‌లో మరో 67 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ క్రమంలో శ్రీలంక లెజెండ్ మహేల జయవర్దనేను వెనక్కు నెట్టి ఐదో స్థానాన్ని ఆక్రమిస్తాడు.

 

చరిత్ర సృష్టించిన కోహ్లీ
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ మరో రికార్డు కూడా అందుకున్నాడు కోహ్లీ కేవలం 257 మ్యాచ్‌లలోనే అంతర్జాతీయంగా 12,500 పరుగులు పూర్తి చేశాడు. సచిన్ 310 మ్యాచ్‌లలో ఈ ఫీట్ సాధించగా రికీ పాంటింగ్ 328 మ్యాచ్‌లలో ఈ మార్క్ అందుకున్నాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 12,500 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -