Virat Kohli: రికార్డుల రారాజు మరో ఘనత.. టీ20 ప్రపంచకప్ లలో అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ రికార్డు..

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇదివరకే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ రన్ మిషీన్ ఇప్పుడు మరో తోపు రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ.. ఈ మెగా టోర్నీలలో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లలో 23 ఇన్నింగ్స్ ఆడి 1065 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో 16 పరుగులు చేయగానే అతడు.. శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దెనే పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచాడు.

 

ఐసీసీ నిర్వహించే టీ20 ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో బంగ్లాదేశ్‌తో ఇండియా మ్యాచ్‌కు ముందు వరకూ మహేళ జయవర్దెనే (31 మ్యాచ్‌లు, 31 ఇన్నింగ్స్ లలో 1,016 పరుగులు) అందరికంటే ముందుండేవాడు. కానీ ఇప్పుడు కోహ్లీ ఆ రికార్డును బద్దలుకొట్టాడు.

 

మహేళ 31 మ్యాచ్ లలో సాధించిన రికార్డును కోహ్లీ.. 23 ఇన్నింగ్స్ లలోనే సాధించడం గమనార్హం. ఈ మెగా టోర్నీలలో జయవర్దెనే.. 1 సెంచరీ 6 హాఫ్ సెంచరీలు చేయగా కోహ్లీ 13 హాఫ్ సెంచరీలు సాధించాడు.

 

టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిస్తే ఇందులో టాప్-5లో భారత్ నుంచే ఇద్దరు క్రికెటర్లు ఉండటం గమనార్హం. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (37 మ్యాచ్‌లు, 34 ఇన్నింగ్స్ లలో 921 పరుగులు) భారత్ నుంచి రెండో ఆటగాడిగా ఉన్నాడు.

 

అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితా :

– విరాట్ కోహ్లీ : 25 మ్యాచ్‌లు (23 ఇన్నింగ్స్) , 1065 పరుగులు
– జయవర్దెనే : 31 మ్యాచ్‌లు (31 ఇన్నింగ్స్), 1,016 పరుగులు
– క్రిస్ గేల్ : 33 మ్యాచ్‌లు (31 ఇన్నింగ్స్), 965 పరుగులు
– రోహిత్ శర్మ : 37 మ్యాచ్‌లు (34 ఇన్నింగ్స్), 921 పరుగులు
– తిలకరత్నే దిల్షాన్ : 35 మ్యాచ్‌లు (34 ఇన్నింగ్స్), 897 పరుగులు

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -