Virat Kohli: ఫామ్‌లోకి రావడమే లేటు.. కింగ్ కొలువులోకి క్యూ కడుతున్న అవార్డులు

Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డును వేసుకున్నాడు. గతంలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఈయర్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్, విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. తాజాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. అక్టోబర్ నెలకు గాను కోహ్లీకి ఈ అవార్డు దక్కింది. ఆసియా కప్‌కు ముందు వరకు ఫామ్ కోల్పోయి తంటాలు పడిన కోహ్లీ తిరిగి మునపటి ఫామ్ ను అందుకోగానే పాత రికార్డుల బూజును దులుపుతూ అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు.

ఈ మేరకు ఐసీసీ తాజాగా ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అక్టోబర్ నెలకు గాను పురుషుల క్రికెట్ లో డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) సికందర్ రజా (జింబాబ్వే), విరాట్ కోహ్లీ (ఇండియా) నామినీలుగా ఉన్నారు. ఈ ముగ్గురిలో అభిమానులు, ఐసీసీ ఓటు కోహ్లీకే వేయడంతో విరాట్ కు తన కెరీర్ లో తొలిసారిగా ఈ అవార్డు దక్కింది.

 

గత నెలలో కోహ్లీ స్వదేశంలో సౌతాఫ్రికాతో గువహతిలో ముగిసిన రెండో టీ20లో అతడు 28 బంతుల్లోనే 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత గతనెల 23న మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపమే చూపాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి కోహ్లీ యుద్ధమే చేశాడు. అంతేగాక ఆ తర్వాత నెదర్లాండ్స్ తో మ్యాచ్ లోనూ అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో మిల్లర్, రజా కంటే ఒత్తిడిలో జట్టును గెలిపించిన కోహ్లీకే ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఈ అవార్డు గెలుచుకోవడంపై తాజాగా కోహ్లీ స్పందిస్తూ.. ‘అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నాకు దక్కినందుకు గర్వంగా ఉంది. నాకు మద్దతునిచ్చిన అభిమానులతో పాటు ఐసీసీకి థ్యాంక్స్.. నాతో పోటీ పడిన మిల్లర్, రజాలకూ అభినందనలు..’ అని తెలిపాడు.

 

పురుషుల జాబితాలో ఈ అవార్డు కోహ్లీకి దక్కగా మహిళల జాబితాలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ నిదా దార్ ఈ అవార్డుకు ఎంపికైంది. ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్ లో బ్యాట్, బాల్ తో రాణించిన నిదాకు భారత స్పిన్నర్ దీప్తి శర్మ గట్టి పోటీనిచ్చిన చివరికి పాక్ అమ్మాయినే ఈ అవార్డు వరించింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: జగన్ మెప్పు కోసం ఈసీ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తున్న అధికారులు.. కొరివితో తల గోక్కుంటున్నారంటూ?

YS Jagan: ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారులు వైసీపీ నేతలు అడుగుజాడల్లో నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ పై స్వామి భక్తి చాటుకుంటున్నారు. అధికారుల వ్యవహారం చూస్తూ ఏపీలో ఈసీ...
- Advertisement -
- Advertisement -