ViratKohli: టైటిల్ గెలవకపోయినా నువ్వే నా ఆల్‌టైమ్ గ్రేట్.. కోహ్లీ భావోద్వేగం

ViratKohli: ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిఫా ప్రపంచకప్ గురించే చర్చ నడుస్తోంది. ఖతార్‌‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. అయితే ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన క్రిస్టియన్ రొనాల్డో జట్టు పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఫిఫా ప్రపంచకప్‌ను ముద్దాడాలనే రొనాల్డో కల చెదిరిపోయింది. దీంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎందుకంటే 37 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో మరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడే అవకాశాలు లేవు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రొనాల్డో అభిమానులందరూ ఆవేదన చెందుతున్నారు.

 

ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన స్టార్ ఆటగాడు రొనాల్డోకు మద్దతు ప్రకటించాడు. ఏ టైటిల్ కూడా రొనాల్డో విలువను తగ్గించలేదని.. క్రీడల్లో ఆయన సాధించిన ఘనతలను చెరపలేదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. నీ ఆటతో మమ్మల్ని అలరించడమే దేవుడిచ్చి గొప్ప వరం అంటూ రొనాల్డోను కీర్తించాడు. అతడి డెడికేషన్, హార్డ్ వర్క్ అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పాడు. రొనాల్డో తన కెరీర్‌లో ఒక్క ప్రపంచకప్ కూడా గెలవకపోయినా అతడే తన ఆల్‌టైమ్ గ్రేట్ ఛాంపియన్ అని కోహ్లీ భావోద్వేగంగా ట్వీట్ చేశాడు.

 

ప్రస్తుతం రొనాల్డో గురించి విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ సూపర్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కొనియాడుతున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా ఎలా ఆడామన్నది చాలా ముఖ్యమని పలువురు కామెంట్లు పెడుతున్నారు. రొనాల్డో తన ఆటతీరుతో ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

చిన్నపిల్లాడిలా ఏడ్చిన రొనాల్డో
కాగా శనివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో అనామక టీమ్ మొరాకో 1-0 తేడాతో బలమైన పోర్చుగల్‌కు చెక్ పెట్టింది. దీంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది. కీలక క్వార్టర్ ఫైనల్లో మొరాకోను తక్కువ అంచనా వేయడమే పోర్చుగల్ ఓటమికి కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు పోర్చుగల్ తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్ చేశాడు. ప్రస్తుతం పోర్చుగల్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో రొనాల్డో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -