Vishnu Vishal-Jwala Gutta: విష్ణు విశాల్ జ్వాలా గుత్తా విడిపోతున్నారా.. భర్త ఏమన్నారంటే?

Vishnu Vishal-Jwala Gutta: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ప్రస్తుతం నిర్మాతగా, హీరోగా ఎంతో బిజీగా ఉన్నాడు. తెలుగులో రవితేజతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. గత ఏడాది FIR అనే చిత్రం తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు మట్టి కుస్తీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన మొదటి పెళ్లి బ్రేకప్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలాతో రెండో వివాహ జీవితంపై స్పందించాడు.

గుత్తా జ్వాలా మాత్రం తనను అర్థం చేసుకుందని, సినిమాల రిలీజ్ టైంలో తాను ఎలా ఉంటానో దగ్గరుండి చూస్తోందని చెప్పుకొచ్చాడు. రెండో పెళ్లి తర్వాత జ్వాలా గుత్తా గురించి చాలా నేర్చుకుంటున్నానని తెలిపాడు. అందరి జీవితాల్లో టెన్షన్స్ ఉంటాయని, కానీ ఒత్తిడిని తట్టుకుని ఎదుటి వారి ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుందని పేర్కొన్నాడు.

నేను ముందు సైలెంట్ అవుతా..

తనకు, జ్వాలాకు కూడా గొడవలవుతాయని, కానీ తానే ముందు కాంప్రమైజ్ అయ్యి సైలెంట్ అవుతానని చెప్పాడు. ప్రతీ ఇంటిలో అబ్బాయి రాజీ పడితేనే సుఖం, సంతోషం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 40 ఏళ్ల కాపురంలో తమ అమ్మ నాన్న చాలా గొడవలు పడినప్పటికీ వారు విడిపోలేదన్నాడు. వాటిని పరిష్కరించుకుని ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారంటూ విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు.

 

ఇక జ్వాలాకి సినిమాల్లో నటించడం ఇష్టం లేదని తెలిపాడు. నితిన్‌తో ఏదో ఏదో ఓ సాంగ్ లో నటించినందుకు ఇప్పటికి ఫీలవుతుందని చెప్పాడు. అయితే ఆమె సినిమాల మీద చెప్పే అభిప్రాయాలు ఎంతో కచ్చితంగా ఉంటాయని అన్నాడు. ఆమె ఎక్కువగా సినిమాలు చూస్తుందని, ఉదయం మొదలు పెడితే.. రాత్రి పడుకునే వరకు చూస్తూనే ఉంటుందని పేర్కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -