Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Casting Couch: ప్రస్తుతం టీవీ రంగంలో ఫిమేల్ యాంకర్ల హవా నడుస్తోంది. అందులో ముఖ్యంగా వినిపించే పేర్లలో అనసూయ, రష్మి, విష్ణుప్రియ, దీపిక పిల్లి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ యాంకర్ల అటు టీవీ షోలు చేస్తూనే ఇటు సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే సామెత వీరికి సరిపోతుంది. రెండు చేతులా డబ్బులు సంపాదిస్తూ లైఫ్ లో ఈ యాంకర్లు ముందుకు సాగుతున్నారు. వీరిలో యాంకర్ విష్ణుప్రియ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది.

షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉండే విష్ణుప్రియ అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆ తర్వాత ఆమె సుధీర్ కలిసి పోవే పోరా అనే షోర్ చేసింది. ఆ షో చాలా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా యువతను ఆ షో బాగా ఆకట్టుకుంది. యాంకర్ గా విష్ణుప్రియకు ఆ షో మంచి పేరు తీసుకొచ్చింది. ఆ షోనే కాకుండా ఈటీవీలో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా విష్ణుప్రియ చేస్తూ వచ్చింది. తన అందంతో ఆ షోలో అందర్నీ ఆకట్టుకుంది.

పోవే పోరా అనే షో ఆగిపోవడంతో సినిమాల వైపు విష్ణుప్రియ మళ్లింది. తాజాగా ఆమె వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొని పలు విషయాలు తెలిపింది. ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్ పై నోరు మెదిపింది. తన జీవితంలో కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్లుగా విష్ణుప్రియ తెలిపింది.

అయితే కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు తాను ఎలాంటి కమిట్ మెంట్లు ఇవ్వలేదని వెల్లడించింది. ఇద్దరి ఇష్టంతో జరిగే పని ఎప్పుడూ తప్పు కాదని, కమిట్ మెంట్ ఇష్టంగా ఇవ్వడంలో తప్పును చూడాల్సిన పని లేదని విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎవరూ బలవంతం చేయనిది తప్పు ఎలా అవుతుందని, ఇద్దరి ఇష్టం లేకుండా ఏ పనీ కూడా జరగదు అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి వివరించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -