Vishwak Sen: విశ్వక్ సేన్ ధమ్కీ సినిమాతో హిట్ కొట్టారా.. ఏం జరిగిందంటే?

Vishwak Sen: విశ్వక్ సేన్ యమా జోరుమీద ఉన్నాడు.వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. పక్కా ప్లాన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. అప్పుడప్పుడు మెగా ఫోన్ కూడా పట్టుకుంటున్న ఈ యంగ్ హీరో, ప్రస్తుతం ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమా ప్రీమిర్ షోలు పడగా ధమ్కీపై తమ అభిప్రయాలు వెల్లడిస్తున్నారు ఆడియన్స్.

యంగ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి చాలా ఎనర్జిటిక్.పైగా మల్టీ ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇక ఆయన రెండోసారి దర్శకత్వం వహిస్తూ చేసిన మూవీ దాస్ కా ధమ్కీ.ఎన్టీఆర్‌ గెస్ట్ గా రావడంతో మూవీపై మంచి అంచనాలు పెరిగాయి.ఇలాంటి తరుణంలో నేడు ఈ మూవీ థియేటర్ లోకి వచ్చింది.మరి ఈ మూవీ విశ్వక్ సేన్ ఆశలను నిలబెట్టిందా లేదా అనేది మాత్రం ఇప్పుడు చూద్దాం.

 

కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) ఒక స్టార్ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తూ జీవితం గడుపుతాడు. ఆయన కీర్తి( నివేత పేతురాజ్) ను ప్రేమిస్తాడు. ఆమెను పడేయడానికి ఓ రోజు కోటీశ్వరుడిగా వెళ్లి బిల్డప్ ఇస్తాడు. ఇలా జరుగుతున్న క్రమంలోనే అచ్చం కృష్ణ దాస్ లాగానే ఉన్న సంజయ్ రుద్ర పెద్ద ఫార్మా కంపెనీ కి అధినేత కనిపిస్తాడు. ఆయన క్యాన్సర్ కోసం ఓ డ్రగ్ ను కనిపెట్టే పనిలో ఉంటాడు. ఇదే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో సంజయ్ రుద్ర ప్లేస్ లోకి కృష్ణ దాస్ వెళ్తాడు. తర్వాత వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి, చివరకు ఏమైంది అనేది మిగతా సినిమా.

 

ఈ సినిమాలో రెండు పాత్రల్లో విశ్వక్ సేన్ జీవించేశాడు. విశ్వక్ మొదటి నుంచి ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీతో కూడా రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు విశ్వక్ సేన్. కొన్ని సీన్లలో ఆవేశ, భావోద్వేగాలను మిలితం చేసి చూపించాడు. నివేత పేతురాజ్ గ్లామర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మిగతా పాత్రల్లో ఎవరికి వారే బాగానే నటించారు.

 

ఈ సినిమాకు విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయకుండా ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్ గా ఉండేది. హీరోగా విశ్వక్ సేన్ బాగానే నటించాడు. కానీ సెకండ్ హాఫ్‌ మొత్తం గాడి తప్పింది. కొన్ని ట్విస్టులు అసలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాకుండా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -