Vishwak Sen-Manchu Vishnu: విశ్వక్ సేన్ కు మంచు విష్ణు వార్నింగ్.. ఏమైందంటే?

Vishwak Sen-Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో 42 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు అర్జున్. యాక్షన్ కింగ్ గా పేరున్న అర్జున్.. తన కూతురిని హీరోయిన్ గా, విశ్వక్ సేన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. అందుకు అంతా సిద్ధం కాగా చివరి నిమిషంలో విశ్వక్ సేన్ ఫోన్ ఎత్తకుండా, రిప్లై ఇవ్వకుండా ఉన్నాడని అర్జున్ మీడియా ముందుకు వచ్చి బాధపడటం తెలిసిందే.

 

 

పలుసార్లు వివాదాల్లో ఇరుక్కున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మళ్లీ మరో వివాదంలో ఇరుక్కోవడంతో.. ఇండస్ట్రీలో దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే తన 42 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ లో తనకు ఎప్పుడూ ఇలా జరగలేదని, సినిమా చేస్తానని కమిట్ అయి.. తర్వాత ఫోన్ ఎత్తని నటుడు విశ్వక్ సేన్ అంటూ అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నటుడు అంటే డిసిప్లెయిన్ ఉండాలని అన్నారు. దీని మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని అర్జున్ వివరించారు.

 

 

తాజాగా అర్జున్ ఈ వివాదం మీద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పలు అగ్రిమెంట్ పేపర్లతో పాటు మరికొన్ని పేపర్లతో అర్జున్ మంచు విష్ణుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మంచు విష్ణు వెంటనే స్పందించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 

ఈ వివాదంపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. ‘మీలాంటి సీనియర్ హీరోను ఇంతలా ఇబ్బంది పెట్టిన విశ్వక్ పై వెంటనే విచారణ జరుపుతాను. ఎంతటి వారైనా సీనియర్స్ కు మర్యాద ఇవ్వాల్సిందే. యూటిట్యూడ్ చూపిస్తే తోక కత్తరిస్తా’ అని అన్నాడనే టాక్ నడుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -