Vishwak Sen: వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్!

Vishwak Sen: సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు కామన్. సినిమాలో పాత్రలు నచ్చకపోతే ఏ హీరో ఆ క్యారెక్టర్ చేయడానికి ముందుకురాడు. అలా అని ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ట్రై చేయడు. ఎందుకంటే స్టార్ హీరోలతో యంగ్ హీరోలు పని చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి హీరోల్లో విశ్వక్‌సేన్ ఒకరు. విశ్వక్‌సేన్.. హీరో అర్జున్‌తో కలిసి ‘రాజయోగం’ సినిమాను ఒప్పుకున్నారు. కానీ ఇతర కారణాల వల్ల చిత్ర యూనిట్ అతడిని బయటికి పంపించింది. అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇటీవల హైదరాబాద్‌లో ‘రాజయోగం’ టీజర్ ఆవిష్కరించారు. అప్పుడు అర్జున్ ఆ కాంట్రవర్సీపై వివరణ ఇచ్చాడు. దానికి విశ్వక్‌సేన్ స్పందించాడు.

 

 

ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘నేను ప్రొషెషనల్ కాదని తనతో పని చేసిన ఏ నిర్మాత, సెట్ బాయ్ చెప్పినా సినీ ఇండస్ట్రీ నుంచి మొత్తానికి దూరమవుతా. ప్రతీ సినిమాలో ఏ పని ఇచ్చినా.. సొంత పనిలా ఫీల్ అయి వర్ చేస్తా. ఓ సినిమా చేసినప్పుడు ప్రయోషన్ బాధ్యతలు కూడా నా మీదే వేసుకుంటా. నా అంత కమిట్‌మెంట్, ప్రొఫెషనల్ ఎవడూ ఉండడు. ఇప్పటివరకు నా వల్ల ఏ నిర్మాత ఇబ్బంది పడింది లేదు. వాళ్లు రూపాయి పోగొట్టుకోలేదు. నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేను చేసింది చాలా చిన్న సినిమాలే అయి ఉండొచ్చు. కానీ పెద్ద నిర్మాతలతో కలిసి పని చేశాను. వాళ్లల్లో ఏ ఒక్కరు వచ్చి నేను ప్రొఫెషన్ కాదని చెప్తే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోతా.’ అని ఏమోషనల్‌గా మాట్లాడాడు.

 

 

హీరో అర్జున్‌పై ఉన్న గౌరవంతో తాను ఆ సినిమాకు ఒప్పుకున్నట్లు విశ్వక్‌సేన్ చెప్పారు. ‘అందరూ హీరోల్లాగే కలిసి పని చేయాలని అనుకున్నా.. మొదట్లో జర్నీ బాగానే అనిపించింది. కానీ కొన్ని సీన్ల దగ్గర ఇలా ఉంటే బాగుంటుంది.. ఇలా చేద్దామని చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. ముందు రోజు వరకూ సినిమా చేద్దామనే అనుకున్నా. కానీ మరుసటి రోజు నాలుగింటికి నిద్ర మెలుకువ పడింది. ఏదో తెలియని భయం. ఎప్పుడూ లేనిది ఇలా భయం ఎందుకు వేస్తోందని ప్రశ్నించుకున్నా. సినిమా ఆపేద్దామని అనుకోలేదు.. షూటింగ్‌కు రానని చెప్పలేదు. కొన్ని మార్పులు చేర్పులూ చేయడానికి చర్చించాలని అనుకున్నా. కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అర్జున్ మేనేజర్ కాల్ చేసి.. మాట్లాడేదేం లేదు.. అడ్వాన్స్ అమౌంట్ తిరిగి పంపమని చెప్పాడు. ఆయన ఈమేజ్ డ్యామేజ్ చేయాలని అనుకోలేదు. అందుకే మౌనంగా ఉన్నా.. కానీ, టీవీల్లో డిబేట్లు పెట్టి నానా రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ సినిమాకి నా ఆల్ ది బెస్ట్’. అని క్లారిటీ ఇచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -