Vishwak Sen: వివాదంపై క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్.. అది లేదంటూ?

Vishwak Sen: తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. సినిమాలతో పాటు వివాదాలకు కేరాఫ్ గా నిలిచే విశ్వక్ సేన్ తాజాగా మరో వివాదంలో ఇరుకున్నాడు. ఒక సినిమా చేస్తానని ఒప్పుకొని, తర్వాత కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా దూరం పెట్టాడని.. అతడి మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయబోతున్నట్లు వివాదం రేగింది.

ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు.. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న యాక్షన్ కింగ్ అర్జున్. విశ్వక్ సేన్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేయగా.. విశ్వక్ ఆ సినిమాకు ఓకే చెప్పి, తర్వాత మాత్రం ఫోన్ కు రిప్లై ఇవ్వలేదని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించాడు. తన జీవితంలో ఇన్నిసార్లు ఫోన్ చేయడం మొదటిసారి అని, తన టీంకు కూడా తీవ్ర అవమానం జరిగిందని అర్జున్ ఆరోపించాడు.

ఈ వివాదం మీద తాజాగా విశ్వక్ సేన్ టీం స్పందించింది. సదరు సినిమా పాటలు, డైలాగ్, మ్యూజిక్ విషయంలో అర్జున్ కు విశ్వక్ సేన్ కొన్ని మార్పులు చేసినట్లు ఆయన టీం వెల్లడించింది. అయితే వాటిని అర్జున్ పట్టించుకోలేదని, సినిమా విషయంలో తాను చెప్పినట్లే నడుచుకోవాలని అర్జున్ మొండిపట్టు పట్టారని.. హీరోగా విశ్వక్ సేన్ కు కనీస గౌరవం ఇవ్వలేదని ఆయన టీం ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ పరిణామాలు నచ్చకనే విశ్వక్ సేన్ ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు ఆయన టీం వెల్లడించింది. అర్జున్ ఆ సినిమా కోసం ఇచ్చిన రెమ్యునరేషన్ తో పాటు అగ్రిమెంట్ డాక్యుమెంట్లను ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి పంపినట్లు విశ్వక్ టీం తెలిపింది. అక్కడే దీనిపై తేల్చుకోనున్నట్లు వివరణ ఇచ్చింది. మొత్తానికి అర్జున్ లాంటి 42 ఏళ్ల అనుభవం ఉన్న హీరో మొదటిసారి మీడియా ముందుకు వచ్చి యంగ్ హీరో ఇలా చేశాడని మాట్లాడటంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -