VishwakSen: ఆ హీరోయిన్‌కు విశ్వక్‌కు మధ్య అలాంటి రిలేషన్ ఉందా?

VishwakSen: యువ హీరో విశ్వక్‌సేన్ తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా మంచి గుర్తింపు ఉంది. ఓ వైపు నటనతో ప్రేక్షకులను మెప్పించడం.. మరోవైపు హాట్ కామెంట్లు చేసి.. ఎప్పుడూ వార్తల్లో నిలవడం విశ్వక్ సేన్ ప్రత్యేకత. తాజాగా విశ్వక్ సేన్‌పై మరో రూమర్ క్రియేట్ అయింది. విశ్వక్ సేన్‌కు హీరోయిన్ నివేదా పెతురాజ్‌కు మధ్య ఏదో కనెక్షన్ ఉందని సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. ప్రస్తుతం విశ్వక్‌ సేన్ ‘ధమ్కీ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది.

అయితే టీజర్ చూసినప్పుడల్లా వీరి మధ్య వస్తున్న పుకార్లు నిజమేనని అనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నివేదా పెతురాజ్ నాన్ గ్లామరస్ పాత్రల్లో మాత్రమే కనిపించింది. కానీ ధమ్కీ సినిమాలో మాత్రం కొత్త అవతారాన్ని చూపించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. అలాగే ట్రైలర్‌లో విశ్వక్ సేన్-నివేదా పెతురాజ్ మధ్య కెమిస్ట్రీ చూస్తే.. రియల్ లైఫ్‌లో కూడా ప్రేమికులుగా ఉన్నారేమోననే సందేహం కలుగుతోంది. కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా నివేదా సింపుల్‌గా చేసేయడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. అయితే దీనిపై విశ్వక్ సేన్, నివేదా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అయితే గతంలో వీరిద్దరూ కలిసి ‘పాగల్’ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డు సృష్టించింది. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో నటిస్తున్నారు. అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఒకే హీరోయిన్‌తో వరుసగా సినిమాలు చేయడం వల్ల వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts