Vitamin B12: ఆ విటమిన్ లోపం వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలా.. మతిమరపు వస్తుందంటూ?

Vitamin B12: ఈ భూమిపై ఉన్న మానవుని శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శరీరానికి ప్రతిరోజు ఎన్నో రకాల విటమిన్లు అవసరం అవుతాయి. ఈ విటమిన్లు మన శరీరంలో తగ్గినప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె మెదడు ఆరోగ్యానికి ఈ విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారం సూర్యరశ్మి ద్వారా విటమిన్లు మన శరీరానికి అందుతాయి.

అయితే, మతిమరుపు, కంటి చూపుకు కారణమైన విటమిన్‌ కూడా ఉంది. ప్రతి పోషక ఆహారం మానవ శరీరానికి ఎన్నో మినరల్స్, విటమిన్ లను అందిస్తుంది. మానవ శరీరానికి ఈ విటమిన్లు లేకుండా ఆరోగ్యంగా ఉండే శక్తి లేదు.ఎందుకంటే విటమిన్ల లోపం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ జ్ఞాపకశక్తిని తగ్గించి మతిమరుపుకు దారితీస్తుంది. మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు మినరల్స్ ఎంతో అవసరం.

మన శరీరానికి రోగ నిరోధక శక్తి పెరగాలంటే కూడా విటమిన్లు చాలా అవసరం. అంతేకాకుండా, మతిమరుపు, కంటి చూపుకు కారణమైన బి12 చాలా ముఖ్యమైన పోషకం. దీనికి సంబంధించిన ఆహారాలను సరైన మొత్తంలో తీసుకోకపోతే అది చెడు పరిణామాలను కలిగిస్తుంది. తొందరగా అలసిపోవడం, ఆఫీసులో నిద్రపోవడం ఈ విటమిన్‌ లోపం వల్ల జరిగే అవకాశం ఉంది.

మనం శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలంటే విటమిన్ బి12ను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పోషకం రెడ్ మీట్, చికెన్, చేపలు, గుడ్లతో సహా అనేక రకాల ఆహారాలలో ఇది లభిస్తుంది. మనిషి శరీరంలో అవసరమైన చాలా రకాల విటమిన్లలో ముఖ్యమైంది విటమిన్ బి 12. కోబాలమిన్ అని ఈ విటమిన్ కి మరో పేరు ఉంది. ఎందుకంటే ఈ విటమిన్ మనిషి నాడీ వ్యవస్థ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. ఇది లోపిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ విటమిన్ లోపిస్తే కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణంగా చిన్న అక్షరాలు చదివేటప్పుడు కంటి చూపు మసకారబారడం, కంటినొప్పి, అలసట లాంటి సమస్యలు రావచ్చు.ఈ విటమిన్ బి12 లోపం కనుక ఉంటే రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో మన శరీరంలో ఇర రక్త కణాలు ఉత్పత్తి తగ్గి ఈ సమస్యకు దారి తీస్తుంది. ఈ విటమిన్ కనుక మన శరీరంలో లోపిస్తే తరచుగా ఎముకల్లో నొప్పిగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు కనిపించినప్పుడు అవసరమైన పోషకాహారం తీసుకోవాలి లేదంటే వెన్నునొప్పి, నడుము నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -