Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్.. వాళ్లు చెప్పింది విన్నారా?

Waltair Veerayya: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. జనవరి 13 ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమాలోని పాటలు ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

 

ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇది ఇలా ఉంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయని, చిరంజీవి, రవితేజలని కలసి తెరపై చూడటం పండగలా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ని అభినందించారు.

 

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా మెగా అభిమానులు మెగాస్టార్ నటించిన గత రెండు సినిమాలు ఊహించిన విధంగా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -