Waltair Veerayya: పూనకాలు లోడింగ్ పాట కాపీనా.. సాక్ష్యాలు ఇవే!

Waltair Veerayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ గా, ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే.. బాక్సాఫీస్ వద్ద హడావిడి మామూలుగా ఉండదు. చిరు సినిమా కన్నా సినిమాలోని పాటలు, చిరంజీవి వేసే స్టైలిష్ డ్యాన్సులు ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టం. అందుకే మెగాస్టార్ సినిమా అంటే ముందుగా పాటలు ఎలా ఉన్నాయనే చర్చ మొదలవుతుంది.

 

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అయిన డాలీ ‘వాల్తేర్ వీరయ్య’ పేరుతో చేస్తున్న సినిమా 2023 సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమైంది. అయితే ఈ సంక్రాంతి బరిలో చిరుతో పోటీ పడటానికి బాలయ్య కూడా మాస్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. అయితే చిరంజీవి అనగానే అందరికీ పాటల గురించి ప్రత్యేక ఆసక్తి ఉండగా.. ‘వాల్తేరు వీరయ్య’కు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. గతంలో మంచి హిట్లు ఇచ్చిన దేవిశ్రీ.. చాలాకాలం తర్వాత తిరిగి తన సత్తాను నిరూపించుకునే అవకాశం ఈ సినిమాతో వచ్చింది.

 

అయితే మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ నుండి వచ్చిన మూడు పాటలు ఇప్పటి వరకు జనాల్లోకి పెద్దగా ఎక్కలేదు. దేవిశ్రీ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడని అనుకుంటే.. అతడు మాత్రం ఉసూరుమనిపించాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా వచ్చిన నాలుగో పాట కూడా అదే కోవకు చెందినదిగా ఉండటం, పాట కాపీ కొట్టినట్లు క్లీయర్ గా ఉండటంతో సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వస్తున్నాయి.

 

‘డోన్ట్ స్టాప్ డ్యాన్సింగ్, పూనకాలు లోడింగ్’ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ టీం ఎంత హుషారెత్తించిన.. పాటలో మాత్రం అంత హుషారు లేదనే విమర్శ వినిపిస్తోంది. పాటలో ఓ బిట్ లో పవన్ కళ్యాణ్ చేసిన బంగారం సినిమాలో వచ్చిన ‘జరుగు జరుగు మనవాడు వచ్చాడు’ అనే ట్యూన్ కాపీ కనిపిస్తోంది. ట్యూన్ కాపీ చేయడంతో పాటు స్క్రీన్ మీద చిరు, రవితేజల కాస్ట్యూమ్ కూడా కాపీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి, శ్రీకాంత్ చేసిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో కాస్ట్యూమ్ ని దించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం నెగిటివ్ ఎపిసోడ్ లో ఉన్న పాజిటివ్ విషయం.. చిరు, రవితేజల స్టెప్పులు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: మేకబోతు గాంభీర్యంతో జగన్ ఎన్నికల పోరు.. సర్వేలను కొంటే సరిపోతుందా?

CM Jagan: త్వరలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా మొదలు కావడంతో ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్ కూడా దాఖలు చేశారు....
- Advertisement -
- Advertisement -