Chiranjeevi: వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్ అన్న చిరు.. వాళ్లకు షాకంటూ?

Chiranjeevi: మెగాస్టార్ హీరో చిరంజీవిగా బాబీ దర్శకత్వంలో ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఎప్పుడు ఈ చిత్రం గురించి మాట్లాడిన చిరంజీవి పలు సందర్భాలలో కచ్చితంగా ఈ చిత్రం ఎవరు ఊహించనంత బ్లాక్ బస్టర్ గా నిలబడుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

ఇటు చిరంజీవి మాసాంగిల్ రవితేజ స్పాంటేనియస్ కామెడీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ లుగా నిలవవచ్చు అని సినీ రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మాస్ మహారాజు రవితేజ ఈ చిత్రంలో చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మరియు టీజర్స్ ఈ సినిమా మీద ఆసక్తిని బాగా పెంచాయి. ఆచార్య మరియు గాడ్ ఫాదర్ వరస ప్లాపుల తర్వాత ఈ చిత్రంపై మెగా అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు.

 

ఈ మూవీకి టైటిల్ విషయంలో కూడా చిరంజీవి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరయ్య అనే వ్యక్తి చిరంజీవి తండ్రితో ఇతను సినిమాల్లో బాగా రాణిస్తాడు అని చెప్పాడట. అప్పటినుంచి ఈ సినిమాల మీద ఆసక్తి కలిగిన చిరంజీవి తర్వాత గొప్ప నటుడిగా ఎదిగాడు. అందుకని ఈ చిత్రం టైటిల్ లో వీరయ్య పేరుని ఉండేలా చిరంజీవి ఆలోచన చేశారని తెలుస్తుంది.

 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అటు విజయ్ వారసుడు ఇటు బాలకృష్ణ వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య కు గట్టి పోటీగా నిలబడే ఆస్కారం ఉంది. అయినప్పటికీ చిరంజీవి ఈ చిత్రం ఎవరు ఊహించని సక్సెస్ సంపాదిస్తుంది అని గట్టిగా చెబుతున్నారు. ఆయనకు డైరెక్టర్ మీద ఉన్న గుడ్డి నమ్మకం నిజమవుతుందో లేదో అనేది మాత్రం మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -