Lakshmi grace: లక్ష్మీ అనుగ్రహం కావాలా.. అయితే ఇలా చేయండి?

Lakshmi grace: మనలో చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు చేతిలో మిగలకపోగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. అలాగే ఎంత పొదుపు చేయాలని చూసినా కూడా ఏదో ఒక విధంగా ఖర్చులు పెరిగి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి వారు వాస్తు శాస్త్రంలో చెప్పిన పరిహారాలను పాటిస్తూ ఉంటారు. కొందరు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల నియమాలను పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

అయినప్పటికీ కొందరికి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికసమస్యల నుంచి బయటపడాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఆహారం ఎక్కువగా పెట్టుకుని వద్దు అని తినే కంచంలో ప్లేట్లు కడిగేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఇంట్లో లేదా బయట ఆహారాన్ని ఎక్కువగా వృధా చేయకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించకపోగా అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఆహారాన్ని పారేయడం అంటే అన్నపూర్ణ దేవిని అవమానించినట్టే అవుతుంది. అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీ అనుగ్రహం లభించదు.

 

అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా కేవలం అవసరమున్న వాటికి మాత్రం ఖర్చు చేయడం మంచిది. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవ్వక తప్పదు. మనకు తోచినంతలో ఉన్నంతలో అవసరమైన వారికి పేదవారికి సహాయం చేయాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకుండా మనశ్శాంతికి ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉండే నిలయం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఇతరులు కష్టపడి సంపాదించిన డబ్బును మీరు దొంగతనం చేశారంటే లక్ష్మీదేవి కోపానికి గురవ్వక తప్పదు. అంతేకాకుండా లక్ష్మీదేవి గ్రహం మీకు లభించదు.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -