iPhone: తక్కువ ధరకే ఐఫోన్ ను పొందాలా.. ఏం చేయాలంటే?

iPhone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారి అయినా కూడా ఐఫోన్ ని ఉపయోగించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధరల కారణంగా చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని యాపిల్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తక్కువ ధరలకు ఐఫోన్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకు వస్తోంది. అయితే అలాంటి వారికోసం కంపెనీ ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది.

ఇప్పుడు యాపిల్ మొబైల్ కొనాలనుకునే వినియోగదారులు రూ. 22,999 చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 మినీ కొనుగోలు చేయవచ్చు. అయితే నిజానికి ఈ మొబైల్ ధర రూ. 59,900 గా ఉంది. కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ రూ. 49,999కే లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ. 27,000 తగ్గుతుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ బ్రాండ్, స్థితి వంటి వాటిమీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి.

 

కంపెనీ తెలిపిన అన్ని షరతులను మీరు పాటిస్తే రూ. 22,999తో యాపిల్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లో విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచెస్ సూపర్ రెటీనా XDE డిస్‌ప్లే కలిగి, IP68 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ పొందుతుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్ ఎ 14 బయోనిక్ చిప్‌సెట్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటివి పొందుతుంది. కంపెనీ ఈ మొబైల్ మీద ఆరు నుంచి ఏడు సంవత్సరాల సెక్యూరిటీ, ఇతర అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -