Vara Lakshmi: ఆయన వల్లే వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ గా నటించలేదా?

Vara Lakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. 2012లో విడుదలైన తమిళ మూవీ ‘పోదా పొడి’ సినిమా ద్వారా సినీ రంగంలోకి తెరంగేట్రం చేశారు. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటివరకు తమిళ సినిమాలు ఎక్కువగా చేసినప్పటికీ.. టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ‘క్రాక్, నాంది, చేజింగ్, యశోద’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ‘శబరి, వర ఐపీఎస్’ వంటి సినిమాలు చేస్తున్నారు.

 

 

చెన్నైలోని హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మైక్రో బయాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వరలక్ష్మీ.. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసింది. నటిగా కెరీర్ ప్రారంభించకున్న ముందు ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంది. అయితే ఈమె చదువుకున్న రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. 2003లో శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ప్రేమిస్తే సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. కానీ తన తండ్రి కోరిక మేరకే ఆ అవకాశాలను వదులుకున్నట్లు వరలక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ..‘హీరో సిద్ధార్థ్ నటించిన బాయ్స్‌, వేరే చిత్రం ప్రేమిస్తే సినిమాలో నాకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఆ సినిమాల్లో నటించకుండా అడ్డుకొన్నది మా నాన్నగారే. మా నాన్నగారికి నేను సినిమాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఓ హీరోయిన్‌ కెరీర్‌ ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాల్లో ఆఫర్లంటే నో అని చెప్పేసేవారు. ‘బాయ్స్, ప్రేమిస్తే’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాలను మిస్ అయ్యానని ఫీలింగ్ లేదు కానీ, కాస్త లేట్‌గా ఇండస్ట్రీలో ఎందుకు ఎంట్రీ ఇచ్చానని ఫీల్ అవుతుంటాను. అయితే ఇండస్ట్రీలోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎలాంటి పాత్రల్లో నటించాలనే విషయంపై క్లారిటీ వచ్చింది.’ అని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -