CM Jagan: ఆ లేఖ సీఎం జగన్ కు శాపమైందా.. అక్కడే తప్పు జరిగిందా?

CM Jagan: ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీపై ఆ పార్టీ నేత రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ చిల్లు పడిన నావ వంటిది. ఈ నావా త్వరలోనే మునిగిపోతుందని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలివైన నాయకులు ఈదుకుంటూ బయటకు వస్తారని అలాగే ఉన్నవారు ఈ నావతో పాటు మునిగిపోవడం ఖాయం అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

23 ఓట్ల మెజారిటీతో పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా 23 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఈ పార్టీపై తిరుగుబాటు చేశారని తెలిపారు. అయితే ఈ తిరుగుబాటు ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలైందని ఇదే విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఈయన తెలిపారు. అయితే జగన్ కు అధికార పొరలు కమ్మేయడంతో ఆయన ఈ విషయాలను గుర్తించలేకపోయారని తెలిపారు.

ఇప్పుడు కనుక టిడిపి ఆదేశించిన ఏకంగా వైసిపి పార్టీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలు టిడిపి పార్టీలోకి చేరుతారని రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఈయన మాట్లాడుతూ పోలవరం పై సీఎం జగన్ రాసిన లేక ప్రస్తుతం ఆయనకు శాపంగా మారిందని తెలిపారు.పక్క రాష్ట్రంలో కెసిఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. కానీ ఈయన మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని తెలిపారు.

 

ఇప్పటికైనా జగన్ వెలిగొండ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలంటూ ఈయన తెలియజేశారు. బటన్ నొక్కితే ఎం వస్తుంది ..సొంత ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు.. పోలవరంపై రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని.అందుకు ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించాలని తనను కూడా ఆహ్వానించాలని రఘురామకృష్ణ రాజు కోరారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో వైసిపి పార్టీ గెలవడం చాలా కష్టం అంటూ ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Sonu Sood: సోనూసూద్ ను కలవడానికి నడిచి వెళ్లిన వ్యక్తి.. చివరకు?

Sonu Sood: సోనూసూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది...
- Advertisement -
- Advertisement -