Tamannaah: ఆ వీడియోలను చూస్తే తమన్నాకు మూడ్ వస్తుందట!

Tamannaah: సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో రూమర్స్ ఎక్కువైపోయాయి. ట్రోలింగ్ సంప్రాదాయం ఎక్కువగా కనపడుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి ఎంత మంది హీరో హీరోయిన్సు వచ్చినా వారి పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అప్పటి ఎన్టీఆర్ దగ్గరి నుంచి నిన్న మొన్న ఇండస్ట్రీకి వచ్చిన విశ్వక్ సేన్ వరకూ కూడా అందరిపై రూమర్స్ కేక పుట్టించాయి. అయితే ఈ రూమర్స్ లో కొన్ని మాత్రమే నిజం అవుతుంటాయి. మిగిలినవన్నీ కూడా అసలు సిసలైన రూమర్సే అని చెప్పాలి.

 

తాజాగా రూమర్స్ పై టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుర్తుందా శీతాకాలం సినిమా ద్వారా ఆమె ఈ మధ్య తెరపై కనిపించారు. అయితే ఆ సినిమా గుర్తుపెట్టుకునే అంత స్థాయిలో కూడా లేదంటూ అభిమానులు రివ్యూలు మీద రివ్యూలు ఇచ్చారు. అయితే వీటిని విన్న తమన్నా సైలెంట్ అయిపోయారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. రూమర్స్ పై మీ స్పందన ఏంటి అని అడగ్గా తమన్నా తన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.

 

తమన్నా మాట్లాడుతూ రూమర్స్ ను తాను బాగా ఎంజాయ్ చేస్తానని అన్నారు. తనపై ఎవరు రూమర్ రాస్తే అది తనకు పాజిటివ్ గా అనుకుంటానని అన్నారు. అంతేకాకుండా తనపై ఫేక్ న్యూస్ రాసి వార్తలు రాసేవారిని చూస్తుంటే తనకు నవ్వు వస్తుందని తెలిపింది. అలాంటి ఫేక్ కంటెంట్ ను ఎలా క్రియేట్ చేస్తారో ఏమోనని పడి పడి నవ్వుకుంటానని, తాను ఎంత స్ట్రెస్ లో ఉన్నా అలాంటి మీమ్స్ చూసి తెగ నవ్వుకుంటానని తెలిపింది.

 

తనపై వచ్చే మీమ్స్ చూసి మైండ్ రిలాక్స్ చేసుకుంటానని తమన్నా తెలిపింది. అంతే కాదు తాను స్ట్రెస్ లో ఉన్నప్పుడు కామెడీ వీడియోస్ చూసి తన మూడ్ ని మార్చుకుంటానని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా మాట్లాడిన మాటలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -