Health tips: అతిగా పోర్న్ చూస్తున్నారా.. పురుషులు జాగ్రత్త?

Health tips: ప్రస్తుత రోజుల్లో యువత పోర్న్ వీడియోలకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లో వినియోగం పెరిగిపోవడంతో చాలామంది టెక్నాలజీని ఇలాంటి చెడ్డవాటికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలామంది చిన్నపిల్లలు కూడా ఈ పోర్న్ వీడియోలకు అలవాటు పడిపోతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు చాలామంది ఆ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. రోజురోజుకి పోర్న్ వీడియోలు చూసేవారి సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది. కరోనా మహమ్మారి తర్వాత పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

అయితే భార‌త్‌లో పోర్న్ సైట్ల‌పై నిషేధం విధించినా కూడా ఇంటర్నెట్ లో ఈ వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, పోర్న్ వీడియోలు అతిగా చూస్తే ప్ర‌మాద‌మే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి ముఖ్యంగా పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదే విషయంపై నిపుణులు స్పందిస్తూ.. పోర్న్ వీడియోలకు అలవాటు పడిపోతేఅనేక రకాల సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ పోర్న్ చిత్రాలు చూడటం.. డ్రగ్స్ తీసుకోవడం రెండు ఒకటేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి మొదట్లో ఏ విధంగా అయితే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుందో అది అలవాటుగా మారితే అవి లేకపోతే ఉండలేనట్టు, పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకసారి వీటికి అలవాటుపడితే క్రమంగా వాటి ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతూ వస్తుంది. మొదట్లో మాదిరిగా హాయి కలగదు. అందువల్ల తరచుగా మరింత ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవటమూ మొదలవుతుంది. అలాగే పోర్న్ వీడియోస్ ని తరచుగా చూసేవారిలో కూడా ఇలాగే జరుగుతున్నట్టు అధ్యయనంలీ వెల్లడయ్యింది. అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే ప్రేరేపితమవుతాయి.

 

వీటిని తరచుగా చూసేవారిలో క్రమంగా వాటి ప్రభావాన్ని తట్టుకోవటం సంభవిస్తోందని దీంతో శృంగార స్పందనలు, సెక్స్ పై ఆసక్తి తగ్గుతూ వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది నిజ జీవితంలో శృంగార అనుభూతిపై విపరీతమైన ప్రభావం చూపుతుందని నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా అలాంటి దృశ్యాలే మనసులో కదలాడుతుండటం, సహజ శృంగారానికీ వాటికీ పోలిక లేకపోవటం మూలంగా చాలామంది అసంతృప్తికి, ఆందోళనలకు లోనవుతున్నట్లు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -