Credit Card: క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలంటే ముందుగా ఇవి చేయాల్సిందే!

Credit Card: ప్రస్తుత కాలంలో క్రిడిట్‌ కార్డు లేనివారుండరు. ఒకొక్కరికి రెండు లేదా మూడు క్రిడిట్‌ కార్డులు కలిగి ఉన్నాయి. గతంలో ఎక్కువగా లావాదేవీలు జరిపేవారు, బ్యాంకుల్లో ఎలాంటి రిమార్క్‌ లేనివారు, రుణాలు తీసుకుని సమయానికి చెల్లించే వారికే ఈ కార్డులు జారీ చేసేవారు. ఇççప్పుడైతే అన్ని బ్యాంకుల వారు మరీ ఒకటికి రెండు సార్లు ఫోన్‌ చేసి క్రిడిట్‌ కార్డులు అంటగడుతున్నారు. మరి కొందరైతే ఏకంగా ఇళ్లకు వచ్చి క్రిడిట్‌ కార్డులు ఇస్తున్నారు. అయితే.. కార్డు తీసుకున్న కొత్తలో చాలా బాగుంటుంది. ఎలాంటి డబ్బులు పే చేయకుండానే షాపింగ్, ట్రావెలింగ్, సినిమా, రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంక్‌ల వద్ద ఈ కార్డులను తెగ వాడేస్తుంటారు. ఇలా వాడుతుండటంతో ఇంకో కార్డుపై ఆశపుట్టి మరో కార్డును తీసుకుంటారు.

 

క్రెడిట్‌ కార్డుల వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో.. అదే స్థాయిలో సమస్యలు కూడా వస్తాయి. దీంతో తీసుకున్న సమయంలో అద్భుతంగా ఉంటోంది. క్రెడిట్‌ కార్డును వినియోగిస్తున్న సమయంలో కూడా చాలా బాగుంటుంది. అయితే అసలు సమస్య ఆతర్వాతే వస్తోంది. ముందుగా కొద్ది నెలలపాటు సాఫీగా జరిగిపోయినా.. తర్వాత రోజుల్లో క్రెడిట్‌ కార్డు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. అది కట్టలేక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య చాలా ఉంటోంది. అందులో ఒక్కోకార్డు ఒక్కో రేటును అధికంగా తీసుకుంటుంది. అప్పుడు అర్థమవుతోంది. ఓరి దేవుడా ఈ కార్డుల గోళ ఉంటని. అయితే ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉన్నవారు వాటిని ఎలా క్లోస్‌ చేయాలో తెలియక ఇంకా బిల్లులు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతుంటారు.

 

అయితే ముందుగా ఏ కార్డును క్లోస్‌ చేయాలనుకుంటే దానిపై ఉన్న అమౌంట్‌ అంతా పే చేయాలి. ఆ తర్వాత సంబంధిత కార్డు కస్టమర్‌కేర్‌కు ఫోన్‌చేసి కార్డుతో పాటు మీ వివరాలన్నీ సమర్పించాలి. రెండవ విధానం మీరు ఏ బ్యాంకు నుంచి కార్డు పొందారో సమీపంలోని బ్యాంక్‌కు వెళ్లి మ్యాన్‌వల్‌గా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అంతేకాక ఈ–మెయిల్‌ ద్వారా కూడా క్రిడిట్‌ కార్డును క్లోస్‌ చేసుకోవచ్చు. దాంతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా కూడా మీ క్రిడిట్‌ కార్డు క్లోస్‌ కు సంబంధించిన వివరాలు అప్‌లోడ్‌ చేస్తే సంబం«ధిత బ్యాంక్‌ వాటంనింటినీ పరిశీలించి పాత బ్యాలెన్స్‌ లేకపోతే వెంటనే మీ కార్డును క్లోస్‌ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -