బన్నీని ముసలోడు అంటూ అవమానించిన చైల్డ్ ఆర్టిస్ట్!

తెలుగు ప్రేక్షకులకు అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్.. అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా మెప్పించిన చిన్నది అంటే ఎవరైనా టక్కున గుర్తు పడతారు

ఆ తర్వాత బాలు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి.. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది కావ్య. కానీ ఆ తర్వాత ఈ చిన్నది తర్వాత ఏ సినిమాలోను కనిపించలేదు. ఇప్పటికి పెరిగి పెద్ద అయ్యి హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

ఇక అల్లు అర్జున్.. కావ్య కళ్యాణ్ రామ్ ను హీరోయిన్ కోసం ఆఫర్ చేశాడట. దానికి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య షాకింగ్ కామెంట్లు చేసింది. ఈ విషయాన్ని కావ్య ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

మసూదా సినిమాతో కావ్య హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కావ్య సంగీత తో పాటు ఆలీతో సరదాగా షోకు వచ్చింది.

 ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు కావ్య వెల్లడించింది. అదేమిటంటే.. స్టార్ హీరో అల్లు అర్జున్ తనని హీరోయిన్ గా డేట్స్ అడిగాడట.

అల్లు అర్జున్ డెబ్యూ సినిమా గంగోత్రి సినిమాలో కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అందులో ఈ కావ్య తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అప్పుడు కావ్య వయసు సుమారు 5 సంవత్సరాలు ఉంటుంది. చాలా ముద్దుగా పాలబుగ్గలు వేసుకుని ఆ మూవీలో హడావిడి చేసింది.

ఇక ఆ పాపను అలా చూసిన అల్లు అర్జున్.. పెద్దయ్యాక నా సినిమాలో హీరోయిన్ గా చేయాలి.. దానికోసం నీ డేట్స్ కావాలి అని అడిగాడట.

ఆ వయసులోనే సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉన్న కావ్య.. నేను పెద్ద అయ్యేసరికి మీరు ముసలోడు అవుతారు అని ముందుగా సమాధానం చెప్పిందట.