హనుమాన్ మూవీ విడుదలైతే ఆదిపురుష్ పరువు గోవింద!

ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

హీరో, దర్శకుడు కూడా ఈ సినిమా కోసం చాలా శ్రమిస్తున్నారు. మొన్నామధ్య ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసారు. 

కథ కథాంశాల పరంగా ఆసక్తిని రేకేతించేలా ఉన్నా.. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మాత్రం అభిమానులను మెప్పించలేకపోయాయి.

చిన్న పిల్లలు చూసే కార్టూన్స్ ఆ..? భారీ అంచనాలతో ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్న ఓం రౌత్.. నిర్మాతల నుండి భారీగా పెట్టిస్తున్నాడని టాక్ వస్తోంది. 

సుమారు 500 కోట్లు బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నఈ సినిమా ట్రైలర్ అంత స్థాయిలో లేదనే అనిపిస్తుంది. చిన్న పిల్లలు చూసే కార్టూన్స్ ను అచ్చు కాపీ పేస్ట్ చేసి నిర్మాతలను ముంచేసాడని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.

 ఓం రౌత్ తప్పు చేస్తున్నాడేమో. గ్రాఫిక్స్ విషయంలో మళ్ళీ ఒకసారి ఆలోచించాలని సూచిస్తున్నారు.

అదిరిపోయిన హనుమాన్.. ఇక నిన్న విడుదలైన హనుమాన్ మూవీ ట్రైలర్ తో ఆదిపురుష్ ట్రైలర్ ని పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్స్. 

కేవలం 15కోట్ల బడ్జెట్ తో సాధారణ స్థాయిలో రూపొందిస్తున్న మూవీ హనుమాన్. అయితే ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. అద్భుతమైన గ్రాఫిక్ ఎఫెక్ట్స్, విజువల్స్ తో వేరే లెవెల్లో ఉంది ట్రైలర్.

ఇక ఇంత తక్కువ బడ్జెట్ తో రూపొందించే హనుమాన్ మూవీలో దర్శకుని సృజనాత్మకత, టేకింగ్ చాలా బాగున్నాయి. 

ఎలాంటి అంచనాలు లేకుండా 15 కోట్లతో తీస్తున్న హనుమాన్ ఏ రేంజులో ఉంది.. ఆదిపురుష్ ఎలా ఉంది? ఒక్కసారి దర్శకుడు ఓం రౌత్ పునః సమీక్షించుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. 

“దయచేసి ఎవరైనా హనుమాన్ ట్రైలర్ తీసుకెళ్లి ఓం రౌత్ కు చుపించాడయ్యా..” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. చూద్దాం దీనితో ఓం రౌత్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో..?