అక్కడ టాటూ వేయించుకున్న అనుపమ.. చూస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనుపమ పరమేశ్వరన్ సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉంది. యువ హీరోల సరసన మెరుస్తూ ఈ అమ్మడు పాపులారిటీ సంపాదించుకుంది.

ప్రేమమ్ సినిమాతో మలమాళంలో మెరిసి ఆ తర్వాత అ..ఆ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.

అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో సైతం అనుపమ పరమేశ్వరన్ యాక్టీవ్ ఉంటోంది. ఈ ముద్దుగుమ్మ తన ఫోటోలను ఎప్పటికప్పుడు నెట్టింట పోస్టు చేస్తూ వారెవ్వా అనిపిస్తోంది.

తాజాగా ఈ చిన్నది కార్తికేయ2 సినిమాతో మరో హిట్ ను అందుకుంది. ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా దూసుకుపోయింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

డీజే టిల్లు సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న చిత్రంలో అనుపమ నటించనుందని టాక్ వినిపిస్తోంది.

నేహా శెట్టి స్థానంలో అనుపమను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో పనిచేయడానికి అనుపమ కూడా సైన్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు సీక్వెల్ రూపొందుతోంది.

ఈ సినిమాకు హీరో సిద్ధునే స్క్రిప్ట్, డైలాగ్స్ కూడా రాయగా తాజాగా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.

తాజాగా అనుపమ తన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. నల్లచీరలో ఛాతిపై టాటూతో, కర్లీ హెయిర్ తో ఎల్లో కలర్ టాప్ లో ఈ ముద్దుగుమ్మ మెరుస్తోంది.

ఈ చిన్నదాని ఫోజులకు కుర్రాళ్లు గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

చెరిగిపోని అందం, నవ్వుతో ప్రేక్షకులను అందులోనూ ముఖ్యంగా యువతను అనుపమ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ఈమె పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తోంది.

ఇందులో కూడా హీరో నిఖిల్ నటిస్తుండటం విశేషం. వీరి జంట మరోసారి తెరపై తమ నటనతో ఆకట్టుకోనున్నారు.