ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కు ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుందా?

జక్కన్న చెక్కిన అద్భుత చిత్రశిల్పం ఆర్ఆర్ఆర్. ప్రపంచ వ్యాప్తంగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుంది

జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినీ స్థాయిని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టింది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాకు సలాం కొట్టారు.

ఇక ఏదో ఒక విభాగంలో ఆస్కార్ కు కూడా నామినేట్ అవుతుందని ఆశగా చూస్తున్న తరుణంలో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరోనే మెయిన్ అంటూ..

కొట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో.సినిమా గురించి మొదట ప్రకటించిన సమయంలో.. అందరూ ఇది రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుందా అనుకున్నారు.

ఆ క్రమంలో తారక్, ఎన్టీఆర్ మధ్య స్నేహం వల్లే ఇది సాధ్యం అయింది. ఇదిలా ఉండగా వారి వారి అభిమానులు మాత్రం ఒకరినొకరు శత్రువుల్లా భావిస్తున్నారు. సినిమా విడుదల అయినప్పటి నుండి ఈ చర్చ ప్రారంభమైంది.

ముఖ్యంగా హీరోలకు ఇచ్చిన పాత్రల రోల్స్ పైనే ఏ చర్చ అంతా. మా హీరోదే మెయిన్ రోల్.. కాదు మా హీరోదే.ఇక సినిమాలో తమ హీరో పాత్ర పవర్ ఫుల్ గా ఉందని చరణ్ ఫ్యాన్స్ అంటూంటే.. ఇంటర్వెల్ ఫైట్,

అద్భుతంగా ఎమోషన్ పండించిన కొమరం భీముడో సాంగ్ చూసి ఎన్టీఆర్ ఏ సినిమాకి హైలెట్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు.

సినిమా ఒక వైపు ఆస్కార్ బరిలో దిగడానికి సిద్ధం అవుతూ ఉంటే.. ఇక్కడ అభిమానులు సపోర్ట్ చేయడం పోయి, ఇలా గొడవలు పడుతుండటం ఏం బాలేదని సినీ ప్రముఖులు అంటున్నారు.

మొదట్లో సాధారణంగా మొదలైన ఈ ఫ్యాన్ ఫైట్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒకరి హీరో అభిమానులను మరొకరు బండ బూతులు తిట్టుకునే స్థాయికి చేరడం ఎవ్వరు ఊహించలేరు.

అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో బెస్ట్ యాక్టర్ విషయంలో ఎలాంటి అవార్డు ఈ మూవీకి రాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే అంతర్జాతీయ అవార్డులు వరిస్తున్న ఈ సినిమాలో తమ హీరో ఉండడాన్ని గర్వించాల్సింది పోయి..

ఇలా కొట్టుకోవడం వల్ల పరువుపోవడమే తప్ప ప్రయోజనం ఉండదని అభిమానులు ఆలోచించాలి.