త్రిష ఇండస్ట్రీలో ఇంత మందితో ఎఫైర్ పెట్టుకున్నారా.. హీరోల లిస్ట్ ఇదే?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష  తెలుగు, తమిళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న త్రిష తమిళ భాషలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇటీవల విడుదలైన మణిరత్నం “పొన్నియాన్ సెల్వన్” సినిమాలో నటించి మెప్పించింది.

ఇక స్టార్ హీరోయిన్ గా కెరీర్లో మంచి గుర్తింపు పొందిన త్రిష వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే మిగిలిపోయింది.సాధారణంగా హీరోయిన్లు జీవితంలో ఎదగటం కోసం వయసు పెరిగినా కూడా పెళ్లికి దూరంగా ఉంటారు.

త్రిష కూడా వయసు పెరుగుతున్న కూడా పెళ్లికి దూరంగా ఉంది. ఇలా ఇప్పటికీ సింగిల్ గా ఉంటున్న త్రిష గతంలో మాత్రం చాలామంది స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి .

ఆ తర్వాత మరొక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కూడా త్రిష గతంలో ప్రేమాయణం నడిపినట్లు సమాచారం.

అంతేకాకుండా టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు పొందిన దగ్గుబాటి రానాతో కూడా త్రిష కొంతకాలం డేటింగ్ చేసి పెళ్లి కి కూడా సిద్ధమైనట్లు వార్తలు వినిపించాయి.

ఇక ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష కొంతకాలానికి అతనికి బ్రేకప్ చెప్పి పెళ్లి రద్దు చేసుకుంది.

అయితే ఇలా త్రిష పెళ్లి రద్దు కావడానికి హీరో ధనుష్ కారణమని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేశాయి.

ఇంతమంది స్టార్స్ తో ప్రేమాయణం నడిపిన త్రిష అందరికీ దూరమై ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. మరీ త్రిష ఎప్పటికి పెళ్లి చేసుకుంటుందో చూడాలి!