హిట్2 మూవీ రివ్యూ

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న అడివి శేష్ హిట్ సీక్వెల్ హిట్2 లో నటిస్తున్నారనే ప్రకటన రాగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది.

నాని ఈ సినిమాకు నిర్మాత కావడంతో ఈ సినిమా కోసం నాని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు.

మేజర్ తర్వాత అడివి శేష్ నటించిన ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం గమనార్హం. ఈ వారం రిలీజైన సినిమాలలో ఈ సినిమకే ఎక్కువ థియేటర్లు దక్కాయి.

ఎస్పీ స్థాయిలో పని చేసే కృష్ణదేవ్(అడివి శేష్) చూడటానికి కూల్ గా ఉన్నా కేసులను మాత్రం తన తెలివితేటలతో సులువుగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో నేరస్థుల బుర్రలు కోడి బుర్రలని శేష్ కామెంట్ చేస్తాడు.

అయితే ఆ తర్వాత విశాఖలోని పబ్ లో ఒక అమ్మాయి దారుణ హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి శరీరంలో వేర్వేరు అమ్మాయిల అవయవాలు ఉండటంతో ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కృష్ణదేవ్ కు అర్థం కాదు.

కృష్ణదేవ్ అలియాస్ కేడీ సమస్య పరిష్కారం కోసం అడుగులు వేస్తున్న సమయంలో అతనికి మరిన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి.

ఆ హంతకుడు ఎవరు? అమ్మాయిలను టార్గెట్ చేసి ఆ హంతకుడు హత్యలు చేయడానికి కారణమేంటి? ఈ ప్రయత్నంలో అడివి శేష్ సక్సెస్ అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే ప్రేక్షకులు మూవీలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఏదైనా ప్రత్యేకతలు ఉంటే ఆ సినిమాలను ఇష్టపడతారు. హిట్2 కూడా ఆ కోవకు చెందుతుంది.

సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది.

ట్విస్ట్ గురించి ఈ సినిమా మేకర్స్ చేసిన కామెంట్లు ఈ సినిమాకు ఒకింత మైనస్ అని చెప్పవచ్చు. విలన్ ఎవరో తెలిసి ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురవుతారు.

మరోవైపు హిట్ సిరీస్ హిట్3 లో నాని హీరోగా కనిపించనుండగా నానికి ఇలాంటి కథలు సూట్ అవుతాయా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.

శేష్ ఈ సినిమాలోని తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మీనాక్షి చౌదరి పాత్ర పరిమితమే అయినా తన నటనతో ఆకట్టుకున్నారు.

నాని ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బీజీఎం, మ్యూజిక్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు నూటికి నూరు శాతం ఔట్ పుట్ ఇవ్వడానికి తమ వంతు కష్టపడ్డారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే

రేటింగ్ : 3/5