కాంతార2 సినిమాలో తారక్ నటిస్తే పూనకాలు గ్యారంటీ?

కన్నడ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో విడుదలైన ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో పలు భాషల్లో డబ్ అయింది.

అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. తెలుగులో భారీగా వసూళ్లను రాబట్టిన ‘కాంతార’ సినిమా థియేటర్లలో ఇంకా బాగా రాణిస్తోంది.

‘కాంతార’ సినిమాను తెలుగులో అల్లు అర్జున్ డబ్ చేసి విడుదల చేయగా.. టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది ఈ సినిమా అద్భుతంగా అంటూ ట్వీట్ చేయడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా కూడా చేస్తూ తెరకెక్కించాడు.

‘కాంతార’ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించిన రిషబ్ శెట్టి.. తనకు టాలీవుడ్ లో ఎవరంటే ఇష్టమో వివరించాడు.

తెలుగులో ఇప్పుడు టాప్ హీరోగా, యాక్టింగ్, డ్యాన్స్ లో తిరుగులేని స్టార్ గా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని రిషబ్ శెట్టి వివరించాడు.

 గతంలో ఎన్టీఆర్ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సినిమాలో పాట పాడటం, పునీత్ జ్ కుమార్ కు కన్నడ రత్న అవార్డు వచ్చినప్పుడు వెళ్లి అద్భుతమైన స్పీచ్ ఇవ్వడంతో కన్నడలో మంచి గుర్తింపు సాధించాడు.

రిషబ్ శెట్టి తారక్ కు వీరాభిమానిగా ఉండగా, యాక్టింగ్ తో ఇరగదీసే ఎన్టీఆర్ గనక కాంతార2లో నటిస్తే మాత్రం ఆ సినిమా వేరే లెవల్ లో ఉంటుందని తారక్ అభిమానులు అంటున్నారు.

అందుకే కాంతార2ని ఎన్టీఆర్ తో ప్లాన్ చేయాలని రిషబ్ శెట్టిని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరికతో పాటు తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ తో రిషబ్ శెట్టి కాంతార2 సినిమాను ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో విడుదలైన ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో పలు భాషల్లో డబ్ అయింది.