ఇనయ రాక్స్ శివ షాక్స్.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!

బిగ్‌బాస్ సీజన్-6 ఈ సారి మరింత చప్పగా ఉందనే చెప్పవచ్చు. కంటెస్టెంట్ల ఆటతీరు, షో నిర్వహణ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఈ సీజన్ మొత్తం పూర్తి వివాదలతోనే వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సారి జరిగిన ఎలిమినేషన్ రౌండ్స్ మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి.

తాజాగా జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో ఇనయ సుల్తానా ఎలిమినేట్ అయింది.స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉంటుందని అనుకున్న తన అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు.

షో నుంచి బయటికి వచ్చిన ఈ భామ.. తాజాగా బిగ్‌బాస్ కెఫెలో యాంకర్ శివతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చింది.

 శివ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

‘షో ప్రారంభం నుంచి చూస్తున్నాను.. ప్రతీసారి ఏ టాస్క్ జరిగినా.. టైటిల్ విన్నర్ నేనే అని గట్టిగా అరిచేదానికి ఎందుకు?’ అని శివ ప్రశ్నించాడు.

దానికి ఇనయా.. ‘నా మీద నాకున్న నమ్మకంతోనే అలా అన్నాను.’ అని చెప్పింది.

‘కంటెస్టెంట్ సూర్యతో లవ్ ట్రాక్ నడపడం వల్ల నీ గ్రాఫ్ తగ్గిందా?’ అని శివ అడగగా..

 ‘అసలు సూర్యను ప్రేమిస్తున్నానని నేను ఎప్పుడైనా చెప్పానా?’ అని రీకౌంటర్ ఇచ్చింది.

 ఊహించని ప్రశ్న ఎదురవ్వడంతో శివ ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత.. ‘సూర్య గురించి రేవంత్ దగ్గర ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేశావు?’ అని అడగగా..

 ‘అది బ్యాక్ బిచ్చింగ్ కాదు.. కోపంలో అలా చెప్పాను.’ అని చెప్పింది.

 ‘అంటే నీకు నచ్చినప్పుడు మాట్లాడుతావు? లేకపోతే స్టేట్‌మెంట్లు వదులుతావా? అని శివ అడగగా..

‘అవి స్టేట్‌మెంట్లు కావు.. ఆ సందర్భంలో అలా అనిపించింది.. చెప్పాను.’ అని తిరిగి కౌంటర్ ఇచ్చింది.

 ‘రేవంత్‌పై నీ అభిప్రాయం ఏంటీ?’ అని శివ ప్రశ్నించగా..దానికి ఇనయా.. ‘సందర్భాన్ని బట్టి మనిషి మారుతుంటాడు.’ అని చెప్పుకొచ్చింది.

‘అంటే అచ్చం నీలాగేనా?’ అని శివ సెటైర్ వేయగా.. దానికి ఇనయా మధ్యలో కలిగించుకుని.. ‘నేనూ, రేవంత్ ఒకేలా ప్రవర్తిస్తామా?’ అని తిరిగి రీకౌంటర్ వేసింది.

దానికి శివ.. ‘ఏమో నాకు తెలియదు.’ అని చెప్పాడు. ‘తెలియదనప్పుడు నా గురించి ఎందుకు చెప్పావ్’ అని ఇనయా ఎదురు తిరిగింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఇనయ రాక్స్.. యాంకర్ శివ షాక్స్..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.