బన్నీ కంటే సుడిగాలి సుధీర్ కు క్రేజ్ ఎక్కువా?

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్‌. ఈ సినిమాకు గాను ఎన్నో అవార్డుల‌ను సొంతం చేసుకోవ‌డంతోపాటు పాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే జ‌బ‌ర్ద‌స్త్ షోతో కెమెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఒక‌వైపు క‌మెడియ‌న్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూనే మ‌రొక‌వైపు యాంక‌ర్‌గా చేస్తూ హీరోగా కూడా త‌న స‌త్తా చాటుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

అయితే తాజాగా అల్లు అర్జున్ సుధీర్‌కి సంబంధించిన ఒక న్యూస్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల‌య్యింది. ఇంత‌కీ విష‌య‌మేమిటంతే మీకు ఈ ఇద్ద‌రిలో ఎవ‌రంటే ఎక్కువ ఇష్టం అంటూ సుడిగాలి సుధీర్ అల్లు అర్జున్ ఫొటోల‌ను పెట్టి ఒక సంస్థ ఒపీనియ‌న్ పోల్ నిర్వ‌హించింది. 

ఈ పోల్‌లో మొత్తం 43,000మంది ఓట్లు వేయ‌గా అందులో సుడిగాలి సుధీర్‌కు 69శాతం ఓట్లు రావ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అల్లు అర్జున్‌కు కేవ‌లం 31 శాతం ఓట్లు మాత్ర‌మే ఓట్లు రావ‌డంతో అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు.

ఈ పోల్ రిజ‌ల్ట్‌ను కొంత‌మంది ట్విట్ట‌ర్‌లో షేర్‌చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. సుధీర్‌ది మామూలు క్రేజ్ కాదంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతోపాటు ఈ పోల్ కింద కామెంట్ల‌లో కూడా చాలామంది సుధీర్‌కి అనుకూలంగా కామెంట్లు చేశారు. 

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సుధీర్ ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నాడ‌ని, అందుకే సుధీర్ అంటే త‌మ‌కు ఎంతో ఇష్ట‌మ‌ని ఆయ‌న అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే యూట్యూబ్ జ‌రిగిన మ‌రో పోల్ కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. 

బన్నీ కంటే సుడిగాలి సుధీర్ కు క్రేజ్ ఎక్కువా?

బన్నీ కంటే సుడిగాలి సుధీర్ కు క్రేజ్ ఎక్కువా?

బన్నీ కంమీకు ఏ జోడి అంటే ఇష్టం అని ర‌శ్మి, సుధీర్ మ‌రియు కృతిశెట్టి, వైష్ణ‌వ్‌తేజ్ జోడీల ఫొటోల‌ను పెట్టి పోల్ నిర్వ‌హించ‌గా, సుధీర్‌-ర‌శ్మీ జంట‌కు 84శాతం ఓట్లురాగా కృతిశెట్టి-వైష్ణ‌వ్ జోడీకి కేవ‌లం 16శాతం మాత్ర‌మే ఓట్లు పోల‌య్యాయి.టే సుడిగాలి సుధీర్ కు క్రేజ్ ఎక్కువా?

 దీంతో సుధీర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అని ఆయ‌న అభిమానులు ఆనంద‌ప‌డుతున్నారు.