తమన్నా విషయంలో స్టార్ డైరెక్టర్ అలా ప్లాన్ చేశారా?

మిల్కీ బ్యూటీగా చాలా సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ తమన్నా. తమిళ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తెలుగులోని టాప్ హీరోలు అందరితో కలిసి పని చేసింది.

అందానికి అందంతో పాటు అదిరిపోయేలా స్టెప్పులు వేసే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉండేది.

సినిమా ప్రపంచంలో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో? ఎవరు ఎప్పుడు స్టార్ డం కోల్పోతారో చెప్పలేం. ఇదే కోవలో బ్యూటీ తమన్నా భాటియా నటించిన సినిమాలు అన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

తెలుగులో అవకాశాలు పెద్దగా రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ వరుస పెట్టి సినిమాలు చేసినా ఏదీ వర్కవుట్ కాలేదు. తమన్నా తన కెరీర్ లో హిట్ చూసి చాలా సంవత్సరాలే అయిందని చెప్పుకోవాలి.

‘ఎఫ్2’, ‘ఎఫ్3’ లో మెరిసినా క్రెడిట్ మాత్రం తమన్నాకు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఆ మధ్యన తమిళంలో వరుసగా హారర్ నేపథ్యంలో సాగే సినిమాల్లో చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో బాలీవుడ్ లో కూడా అమ్మడు అవకాశాల కోసం చూస్తోంది.

సినిమా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో నెగిటివ్ షేడ్స్ ఉండే హీరోయిన్ పాత్రలు వేయడానికి తమన్నా భాటియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే ఇవేవీ పెద్దగా ఆమెకు కలిసి రాకపోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో మిల్కీ బ్యూటీ ఉండిపోయింది. ఈ తరుణంలో ఓ బాలీవుడ్ డైరెక్టర్ తమన్నాను తల్లిని చేస్తాడనే ప్రచారం సాగుతోంది.

బాలీవుడ్ డైరెక్టర్ ఒకతను చేస్తున్న సినిమాలో తమన్నాకు తొమ్మిది సంవత్సరాల పాపకు తల్లిగా తమన్నాకు అవకాశం ఇచ్చాడట. యంగ్ మదర్ రోల్ లో తమన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా..

తమన్నాకు ఏ అవకాశాలు లేకపోవడంతోనే చివరకు ఆమె తల్లి పాత్రలు వేయడానికి కూడా సిద్ధమైపోయిందనే టాక్ నడుస్తోంది.