క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్లు వీరే

ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఆటలలో క్రికెట్ కూడా ఒకటి. ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ జంటిల్మెన్స్ గేమ్ దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. క్రికెట్ 19వ శతాబ్దంలో పుట్టింది. 

అప్పటి నుంచి క్రికెట్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.. కొత్త ఫార్మాట్లు వచ్చాయి, కొత్త జట్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాయి. టీ20 క్రికెట్ వచ్చాక ఆటగాళ్లు దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు.

సిక్సర్లతో బాహుబలి ఆటగాళ్లు! ఒక క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఫార్మెట్లలో కలిపి ఆటగాళ్ళు ఎన్ని సిక్సులు కొట్టారు అనేది కూడా ఒక రికార్డ్ అయిపొయింది. 

కొంత మంది బ్యాట్సమెన్ ఈ రికార్డు బద్దలు కొట్టి తమ స్థాయి ఏంటో చూపించారు. ఇందులో కొంతమంది ఇండియన్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. మిగతా ఆటగాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం.

ప్రస్తుత ఇండియన్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అవలీలగా సిక్సర్లు కొట్టగల సామర్ధ్యం ఈయన సొంతం.

పుల్ షాట్స్ ఆడటంలో రోహిత్ శర్మ కి ఎవరూ పోటీ రారు. ఒకసారి కాదు మూడు సంవత్సరాలు హిట్ మ్యాన్ ఈ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నారు. 

2017,2018,2019 లో రోహిత్ శర్మ అన్ని ఫార్మెట్ లలో కలిపి అత్యధిక సిక్సులు సాధించాడు.

వరుసగా 65,74,78 సిక్సులు కొట్టి మూడు సంవత్సరాలు ఈ రికార్డ్ ని తన సొంతం చేసుకున్నారు.

2015లో మిస్టర్‌ 360 గా పేరు పొందిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డెవిలియర్స్ 63 సిక్సులు బాది ఆ సంవత్సరం చరిత్ర సృష్టించాడు.

ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ 2018 లో 74 సిక్సులు బాది రోహిత్ శర్మతో కలిసి రికార్డ్ ని పంచుకున్నాడుమాజీ ఇంగ్లాండ్ సారధి ఇయాన్ మోర్గాన్ 2019 లో 609 సిక్సులు బాది రికార్డ్ సాధించాడు.