Jr NTR House: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ తరం హీరోల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరోల జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా టాప్ లో ఉంటాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ‘నెంబర్ వన్ స్టూడెంట్’తో అడుగుపెట్టిన తారక్.. ‘ఆర్ఆర్ఆర్’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. నటనలో, డ్యాన్స్ లో, యాక్టింగ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.
నందమూరి నట వారసుడిగా, మూడో తరం నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న తారక్.. భారీ రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు టాప్ డైరెక్టర్లతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ఓ సినిమా చేస్తుండగా.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. దీంతో రాబోయే సంవత్సరాల్లో ఎన్టీఆర్ స్టార్ డం విపరీతంగా పెరనుంది.
తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఇంటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ కోసం చూసే ఎన్టీఆర్.. తన ఇంటిని కూడా ఎంతో అందంగా, అద్భుతంగా మలుచుకున్నాడని నెట్టింట చర్చ సాగుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కు అందమైన ఓ ఇంద్రభవనం ఉందని తెలుస్తుండగా.. దాని ఖరీదు రూ.25కోట్ల పైమాటే అనే టాక్ నడుస్తోంది.
ఇంటి విషయంలో ఎన్టీఆర్ తన అభిరుచిని చాటుకున్నాడనే విషయం.. ఇంటిని చూసిన ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. ఇంట్లోని లివింగ్ రూమ్ ను ఎంతో పాష్ ఇంటీరియర్ తో సిద్ధం చేసిన ఎన్టీఆర్.. ఓల్డ్ మరియు లేటెస్ట్ డిజైన్ల కలయికతో ఇంటిని ఎంతో అందంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంద్రభవనం లాంటి ఇళ్లను కలిగిన అతి తక్కువ మంది ఇండస్ట్రీ వ్యక్తుల జాబితాలో ఎన్టీఆర్ కూడా చేరాడు.
కేవలం ఇంటి వరకే కాకుండా ఇంటి పక్కన ఎన్టీఆర్ ఎంతో విశాలమైన, అందమైన తోటను సిద్ధం చేసుకోవడం కూడా కొన్ని ఫోటోల్లో మనకు కనిపిస్తుంటుంది. ఆ తోట వద్ద ఓ ఎంట్రెన్స్ గేట్ పెట్టి.. దానిని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. దానికి ఓ భారీ గంటను కూడా ఏర్పాడు చేసి తన అభిరుచిని చాటుకున్నాడు. ఇక కార్లు, బైకులు అంటే విపరీతమైన పిచ్చిని కలిగి ఉన్న ఎన్టీఆర్.. ఆడి, రేంజ్ రోవర్, మెర్సిడెస్ కంపెనీ కార్లతో పాటు ఎన్నో బైకులను తన ఇంట్లో పెట్టుకున్నాడు.